Pawan Kalyan: భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్..’సీఎం సీఎం’ అంటూ..!

ఏపీ ఎన్నికల ఫలితాల రోజు రానే వచ్చింది. ప్రస్తుతం టీడీపీ కూటమి వీర విహారం చేస్తుంది అని చెప్పాలి. మొత్తంగా 160కి పైగా స్థానాల్లో ఆధిక్యత సాధించే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిఠాపురంలో 70,354 ఓట్ల భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీత పై గెలుపొందారు. అంతేకాదు జనసేన అభ్యర్థులు చాలా వరకు గెలిచే ఛాన్స్ కనిపిస్తుంది. క్లీన్ స్వీప్ దిశగా పయనిస్తుంది అని చెప్పాలి.

మరోపక్క వైసీపీ పార్టీ 20 స్థానాల్లో కూడా గెలుపొందే అవకాశం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా.. పవన్ కళ్యాణ్ విజయంతో జనసైనికులు అంతా సంబరాల్లో మునిగితేలుతున్నారు అని చెప్పాలి. టీడీపీ అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క.. పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న తన నివాసంలో భార్యతో తన ఆనందాన్ని పంచుకున్న విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల..

ఆయనకు వీర తిలకం దిద్ది హారతి ఇవ్వడాన్ని మనం గమనించవచ్చు. ఆ వెనుక పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నాడు. ఇక పవన్ ఇంటి బయట జనాలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. ‘సీఎం సీఎం’ అంటూ అరుస్తూ.. తమ ఆనందాన్ని చాటిచెప్పారు. మరోపక్క విజయోత్సాహంతో పవన్ కళ్యాణ్ మంగళగిరికి బయలుదేరారు. అలాగే అటు నుండి ఇప్పటం ప్రజలను కూడా పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయట. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ‘గేమ్ ఛేంజర్’ గా వ్యవహరించారు అనేది వాస్తవం.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.