March 16, 202501:36:09 PM

Vishwak Sen: ఇన్స్టా ఖాతాని క్లోజ్ చేసిన విశ్వక్.. మేటర్ అదేనా?

విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇటీవల ‘కల్కి 2898 ఎడి’ (Kalki 2898 AD)  ట్రైలర్‌ విషయంలో ఓ యూట్యూబర్ తో గొడవ పెట్టుకున్నాడు. ‘ఇండస్ట్రీ అంటే వేలాది కుటుంబాలది. చాలా కుటుంబాలు ఇండస్ట్రీ పై ఆధారపడి బ్రతుకుతున్నాయి. అలాంటి గొప్ప పరిశ్రమ అంటే యూట్యూబర్లకు సరదా అయిపోయింది. సినిమాలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే ఇలాంటివారు ఏదైనా షార్ట్‌ ఫిలిమ్‌ తీసి చూపించండి. సినిమా కార్మికుల కష్టాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా’ అంటూ కామెంట్స్ చేశాడు విశ్వక్ సేన్.

దీనికి ముందు విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కి  (Gangs of Godavari)సైతం ఆ యూట్యూబర్ నెగిటివ్ రివ్యూలు ఇచ్చాడు. బహుశా అది మనసులో పెట్టుకునే విశ్వక్ సేన్ ఇలా అనుంటాడు అంటూ చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా విశ్వక్ సేన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని క్లోజ్ చేశాడు. ఇంత సడన్ గా విశ్వక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి? అని అతని అభిమానులు కంగారు పడుతున్నారు.

కరెక్ట్ రీజన్ ఏంటి అనేది ఎవరికీ తెలీదు. బహుశా యూట్యూబర్స్ అంతా విశ్వక్ సేన్ పై జరిపిన ట్రోలింగ్ వల్ల భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడా? లేక సినిమాలు ఏవీ లేవు కదా.. ? అని భావించి సినిమా వచ్చాక మళ్ళీ ఇన్స్టా ని యాక్టివేట్ చేద్దాం అని డిసైడ్ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క విశ్వక్ సేన్ చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.