March 17, 202503:16:04 AM

Viswambhara: చిరంజీవి ‘విశ్వంభర’లో యువ హీరో… ఎవరంటే? ఎందుకంటే?

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నెక్స్ట్‌ సినిమా ‘విశ్వంభర’ (Vishwambhara) షూటింగ్‌ ఫుల్‌ స్వింగ్‌లో సాగుతోంది. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్‌లు ఇస్తున్నా.. వచ్చే సంక్రాంతికి సినిమాను తీసుకురావాలని టీమ్‌ భారీ ప్లాన్స్‌ వేస్తోంది. అందుకు తగ్గట్టుగా దర్శకుడు మల్లిడి వశిష్ఠ (Mallidi Vasishta) షూటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో మరో యంగ్‌ హీరో భాగం కాబోతున్నారు అనేది లేటెస్ట్‌ టాక్‌. ఈ మేరకు త్వరలో అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని కూడా అంటున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా భారీ విజయంతో ఊపు మీదున్న చిరంజీవిని, అతని ఫ్యాన్స్‌ను ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) , ‘భోళా శంకర్‌’ (Bhola Shankar) అంటూ వరుసగా దెబ్బ కొట్టాయి. ఇప్పుడు వాటికి మందు వేయడానికి, తిరిగి ఫుల్‌ స్వింగ్‌లోకి రావడానికి ‘విశ్వంభర’ సినిమా కరెక్ట్‌ అని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. ఇప్పుడు ఈ సినిమా వారికి మాత్రమే కాదు వైష్ణవ్‌ తేజ్‌కి (Vaishnav Tej) కూడా కీలకంగా మారబోతోంది అట. అవును.. ఈ సినిమాలో వైష్ణవ్‌ కూడా ఉన్నాడట.

‘విశ్వంభర’ సినిమాలో కీకలమైన యువ కథానాయకుడి పాత్ర ఉందట. దీని కోసం చాలామంది యువ కథానాయకులు, నటుల్ని అనుకున్నాక.. వైష్ణవ్‌ అయితే బెటర్‌ అనే మాట వినిపించింది. దీంతో అతనినే ఫైనల్‌ చేశారు అంటున్నారు. త్వరలో సినిమా సెట్‌లో వైష్ణవ్‌ అడుగుపెడతాడట. చిరంజీవి, మరో యువ నటి కాంబినేషన్‌లో వైష్ణవ్‌ మీద సీన్స్‌ తెరకెక్కిస్తారు అని అంటున్నారు. మొదటి సినిమా ‘ఉప్పెన’ (Uppena) తర్వాత వైష్ణవ్‌కు సరైన విజయం లేని విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. ఇందులో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపిస్తారట. అతనికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు అని సమాచారం. హీరోయిన్‌గా త్రిష (Trisha) నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేస్తారని టాక్‌. అలాగే ఈ సినిమాఓల ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) టచ్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.