March 16, 202511:51:42 AM

Chiranjeevi, Pawan, Charan: చిరంజీవి, పవన్, చరణ్ కాంబో కోసం లైన్ సిద్ధం.. కానీ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్స్ మల్టీస్టారర్లు తెరకెక్కుతుండగా ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మల్టీస్టారర్లుగా తెరకెక్కిన సినిమాలు బిజినెస్ విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తుండటం కొసమెరుపు. అయితే స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్  (Harish Shankar) చిరంజీవి (Chiranjeevi) , పవన్ (Pawan Kalyan) , చరణ్  (Ram Charan)  కాంబోలో మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. చిరంజీవి, పవన్, చరణ్ హీరోలుగా ఒక సినిమా అనుకున్నానని ఆ లైన్ ఎప్పటినుంచో వర్క్ చేసి పెట్టుకున్నానని ఆ సినిమా చేస్తే పెద్ద పాన్ ఇండియా మూవీ అవుతుందని హరీష్ శంకర్ కామెంట్లు చేశారు.

పెద్ద స్పాన్ అనేది సినిమా కథలోనే రావాలని ఈ దర్శకుడు అభిప్రాయపడ్డారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగా హీరోలతో మంచి అనుబంధం ఉంది. స్టోరీ లైన్ అద్భుతంగా ఉంటే చిరంజీవి, పవన్, చరణ్ కాంబోలో మల్టీస్టారర్ రావడం కష్టమైన విషయం అయితే కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ శంకర్ త్వరలో మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరగడం గమనార్హం. మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)సినిమాతో రవితేజకు   (Ravi Teja)  ఏ రేంజ్ హిట్ దక్కుతుందో చూడాలి. రైడ్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే ఈ సినిమాకు చాలా మార్పులు చేశారు. రవితేజకు జోడీగా ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటించారు.

మాస్ మహారాజ్ రవితేజ భారీ ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. రవితేజ తర్వాత సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాను సైతం వీలైనంత వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. హరీష్ శంకర్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.