March 17, 202501:52:06 AM

Complaint Against Raj Tarun: రాజ్ తరుణ్ తో గుడిలో పెళ్లైంది.. లావణ్య సంచలన వ్యాఖ్యలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉయ్యాల జంపాల (Uyyala Jampala), సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ సినిమాలతో రాజ్ తరుణ్ (Raj Tarun) వరుస విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే తర్వాత రోజుల్లో కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల రాజ్ తరుణ్ కు వరుస ఫ్లాపులు ఎదురయ్యాయి. అయితే లావణ్య అనే యువతి తాజాగా రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేయగా ఆ అరోపణలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ స్నేహితురాలైన లావణ్య రాజ్ తరుణ్ నా ప్రపంచం అని నాకు రాజ్ తరుణ్ కావాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గత 11 సంవత్సరాలుగా రాజ్ తరుణ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నానని ఇదివరకే మేము గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని ఆమె చెప్పుకొచ్చారు. ఒక హీరోయిన్ వల్ల రాజ్ తరుణ్ నన్ను వదిలేశాడంటూ లావణ్య సంచలన ఆరోపణలు చేయడం గమనార్హం. గత మూడు నెలలుగా రాజ్ తరుణ్ ఇంటికి రావడం లేదని ఆమె వెల్లడించారు. రాజ్ తరుణ్ ను కాంటాక్ట్ కావాలని ప్రయత్నించినా అతను అందుబాటులోకి రావడం లేదని లావణ్య పేర్కొన్నారు.

నేను గతంలో ఒక కేసులో పోలీసులకు చిక్కానని ఆ సమయంలో రాజ్ తరుణ్ నుంచి ఎలాంటి సహాయం అందలేదని ఆమె తెలిపారు. యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై రాజ్ తరుణ్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. ఈ ఏడాది నా సామి రంగ (Naa Saami Ranga) సినిమాలో చిన్న రోల్ లో నటించి రాజ్ తరుణ్ ప్రశంసలు పొందారు.

రాజ్ తరుణ్ తిరగబడర సామి అనే సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల కాగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రాజ్ తరుణ్ కెరీర్ పుంజుకుంటుందని ఫ్యాన్స్ భావించిన సమయంలో ఊహించని విధంగా వివాదంలో చిక్కుకోవడం కొసమెరుపు. ఈ కేసు రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.