March 16, 202509:55:24 AM

Janaka Aithe Ganaka Teaser: సుహాస్ నుండి మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ సినిమా..!

సుహాస్ (Suhas) సినిమాలపై ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో మంచి నమ్మకం ఉంది. ‘కలర్ ఫోటో’ (Colour Photo) (ఓటీటీ హిట్) ‘రైటర్ పద్మభూషణ్'(Writer Padmabhushan) ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band) వంటి సినిమాలు దేనికవే ప్రత్యేకంగా నిలిచి.. డీసెంట్ సక్సెస్..లు అందుకున్నాయి. అయితే తర్వాత వచ్చిన ‘ప్రసన్నవదనం’ (Prasanna Vadanam) కాన్సెప్ట్ పరంగా ప్రేక్షకులను ఆకర్షించింది కానీ.. థియేటర్ల వరకు జనాలను రప్పించలేకపోయింది. అదే టైంలో ‘శ్రీరంగనీతులు’ (Sriranga Neethulu) అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా వచ్చింది అని జనాలకి తెలిసే లోపే థియేటర్ల నుండి వెళ్ళిపోయింది.

ఏదేమైనా సుహాస్ కథల సెలక్షన్ కి మాత్రం పేరు పెట్టాల్సిన పనిలేదు. త్వరలో మరో క్రేజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు సుహాస్. దాని పేరు ‘జనక అయితే గనక’. ‘దిల్ రాజు ప్రొడక్షన్స్’ లో ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా టీజర్ ను ప్రభాస్ తో (Prabhas) లాంచ్ చేయించింది చిత్ర బృందం. 1 : 35 నిమిషాల నిడివి కలిగిన ఈ టీజర్లో సినిమా కాన్సెప్ట్ ని తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఈ రోజుల్లో పిల్లలను కనడం, పెంచడం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెందిన కుర్రాడు.. పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలు వద్దు అనుకుంటాడు. ఆ మిడిల్ క్లాస్ కుర్రాడిగా సుహాస్ కనిపించాడు. అతని భార్య పాత్రలో విపిన్ సంగీర్తన హీరోయిన్ గా నటించింది.రిలీజ్ డేట్ అయితే ఇందులో రివీల్ చేయలేదు. టీజర్ అయితే ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.