March 16, 202509:55:36 AM

Paruchuri Gopala Krishna: ఇన్నిరోజులు పవన్ మాట్లాడింది డైలాగ్స్ కాదు.. పరుచూరి కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఏడాది సాధించిన ఎన్నికల ఫలితాలు సంచలనం అయ్యాయనే సంగతి తెలిసిందే. తాను గెలవడంతో పాటు పవన్ కళ్యాణ్ పార్టీని గెలిపించుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. పవన్ గెలుపు గురించి ఇప్పటికే ఒక సందర్భంలో కామెంట్స్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) మరోసారి పవన్ గెలుపు గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని పరుచూరి తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిలా ఎత్తుగడలు వేశారని పరుచూరి పేర్కొన్నారు. పవన్ అప్పుడప్పుడూ అకస్మాత్తుగా చిరునవ్వు నవ్వుతుంటారని ఆయన చెప్పుకొచ్చారు. నేను పవన్ కు వీరాభిమానినని పవన్ సినిమాలు రాసే అదృష్టం మాకు దక్కలేదని పరుచూరి చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో పవన్ పోరాటం చేశారని ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వేల ఓట్ల మెజారిటీతో గెలవడం సులువైన విషయం కాదని ఆయన తెలిపారు.

పవన్ తను గెలవడంతో పాటు పార్టీ తరపున పోటీ చేసిన వారందరినీ గెలిపించుకొని చరిత్ర సృష్టించారని పరుచూరి పేర్కొన్నారు. ఇన్నిరోజులు పవన్ మాట్లాడింది సినిమా డైలాగ్స్ కాదని మానసిక బలంతో పవన్ ముందడుగులు వేశారని ఆయన చెప్పుకొచ్చారు. సినిమా రంగంలో పవన్ స్థాయి అందరికీ తెలుసని పవన్ ఎంతో హుందాగా, ఓపికగా పని చేస్తున్నారని ఆయన వెల్లడించారు. పవన్ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని పరుచూరి పేర్కొన్నారు.

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే తత్వం పవన్ దని వారాహి మాల వేసుకుని పవన్ కనిపించిన సమయంలో ముచ్చటేసిందని ఆయన వెల్లడించారు. పవన్ రాజకీయాల్లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నానని పరుచూరి చెప్పుకొచ్చారు. పరుచూరి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.