March 16, 202509:44:31 AM

Kalki 2898 AD OTT: కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ విషయంలో ఫ్యాన్స్ కు భారీ షాక్ తగలనుందా?

కల్కి 2898 ఏడీ  (Kalki 2898 AD) మూవీ విడుదలై ఐదు వారాలు అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సినిమా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కల్కి సినిమాను థియేటర్లలో ఇప్పటికే చూసిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. అయితే ఆగష్టు నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని భోగట్టా.

ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా రెంటల్ విధానంలో మొదట ఈ సినిమా అందుబాటులోకి వస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే మాత్రం కల్కి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. అమెజాన్ ప్రైమ్ గతంలో కొన్ని సినిమాలను ఈ విధానంలో అందుబాటులోకి తెచ్చినా ఈ మధ్య కాలంలో ఈ విధానంలో సినిమాలను అందుబాటులోకి తెచ్చిన సందర్భాలు అయితే లేవు.

అయితే కల్కి 2898 ఏడీ మూవీ అంచనాలకు మించి విజయం సాధించిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ మేకర్స్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సీక్వెల్ మొదలు కావడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీపిక పదుకొనే (Deepika Padukone) వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పట్లో షూటింగ్స్ లో పాల్గొనడానికి ఆసక్తి చూపడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ సీక్వెల్ వచ్చే ఏడాది సెకండాఫ్ లో మొదలయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. కల్కి సీక్వెల్ సైతం అంచనాలకు మించి సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.