April 22, 202506:39:30 PM

Poonam Kaur: మరోసారి పవన్ పై సెటైర్ వేస్తూ.. హాట్ టాపిక్ అయిన పూనమ్ పోస్ట్.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) – అల్లు అర్జున్ (Allu Arjun)  ..ల మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది, మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ని దూరం పెట్టింది.. అంటూ కొన్ని నెలలుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల్లో భాగంగా అల్లు అర్జున్ వెళ్లి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవి తరఫున ప్రచారం చేసి వచ్చాడు. ఇది మెగా అభిమానులకి గానీ, జనసేన కార్యకర్తలకి కానీ అస్సలు నచ్చలేదు. నాగబాబు (Naga Babu) రూపంలో మెగాఫ్యామిలీ పరోక్షంగా ఈ విషయంపై స్పందించింది.

Poonam Kaur

పవన్ కళ్యాణ్ సైతం ఇటీవల ‘చెట్లని నరికేవాడు హీరో’ అన్నట్టు అల్లు అర్జున్ పై సెటైర్ వదిలాడు. మరోపక్క అల్లు అర్జున్ సైతం ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ (Maruthi Nagar Subramanyam) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ‘నా వాళ్ళ కోసం నేను వస్తా’ అంటూ పరోక్షంగా పవన్ అభిమానులకి చురకలు అంటించాడు. సోషల్ మీడియాలో పవన్ వెర్సస్ బన్నీ .. అంటూ ఫ్యాన్స్ మాటల యుద్దానికి దిగిన సంగతి తెలిసిందే.

ఎక్కడివరకు బాగానే ఉంది. ఇప్పుడు సడన్ గా పూనమ్ కౌర్ (Poonam Kaur) ఎంట్రీ ఇచ్చింది. అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి.లతో కలిసి దిగిన ఓ ఫోటోని షేర్ చేసి.. మరోసారి పవన్ పై తన కోపాన్ని చూపించింది. ‘ప్రేమ .. ప్రార్ధనలు.. సామరస్యం’ అంటూ ఆ ఫోటోకి ఆమె క్యాప్షన్ పెట్టడం జరిగింది. సమయం దొరికిన ప్రతిసారి పవన్ కి వ్యతిరేకంగా ఆమె  ఏదో ఒక పోస్ట్ పెట్టడం ఆనవాయితీ అయ్యింది.

పీపుల్ మీడియా భవిష్యత్తు ప్రభాస్ చేతుల్లోనే..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.