March 16, 202501:41:04 PM

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం మూవీతో నాని ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయమా?

న్యాచురల్ స్టార్ నానికి (Nani) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దసరా (Dasara) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాయి. మరికొన్ని రోజుల్లో నాని సరిపోదా శనివారం  (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. ఈ సినిమాలో ఎస్జే సూర్య (SJ Suryah)  పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విలన్ రోల్ లో కనిపించనున్నారు.

Saripodhaa Sanivaaram

అయితే ఎస్జే సూర్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సరిపోదా శనివారం మూవీ స్టోరీ లైన్ ను రివీల్ చేశారు. వారంలో అన్ని రోజులు కూల్ గా ఉండే కుర్రాడు శనివారం రోజు మాత్రం తన కోపాన్ని ప్రదర్శిస్తాడని ఎందుకంటే చిన్నప్పుడు తల్లికి మాట ఇచ్చి ఉంటాడని ఎస్జే సూర్య తెలిపారు. విపరీతమైన కోపం ఉన్న కుర్రాడి నుంచి తల్లి మాట తీసుకుంటుందని ఆయన అన్నారు.

కోపాన్ని అన్ని రోజులు కాకుండా వారంలో ఒక రోజు మాత్రమే చూపించాలని తల్లి మాట తీసుకుంటుందని ఎస్జే సూర్య కామెంట్లు చేశారు. సరిపోదా శనివారం మూవీ స్టోరీ లైన్ గురించి ఎస్జే సూర్య కామెంట్లతో క్లారిటీ వచ్చేసింది. అయితే కథనం కూడా ఇలాంటి సినిమాలకు అద్భుతంగా ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో ఇప్పటికే అంటే సుందరానికి సినిమా తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.

నాని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా నాని భవిష్యత్తు సినిమాలు సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాని సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయనే సంగతి తెలిసిందే. మాస్ సినిమాలతో పాటు క్లాస్ సినిమాలలో నటిస్తూ నాని తన నటనతో మెప్పిస్తున్నారు.

అక్కినేని వారి కొత్త కోడలు..చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ పిక్స్ వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.