March 16, 202510:23:39 PM

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారంకు పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడానికి అసలు కారణాలివే!

న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్షన్ లో తెరకెక్కిన సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) మూవీ నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. నాని కెరీర్ లో ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. అయితే సరిపోదా శనివారం సినిమాకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఫ్యాన్స్ సైతం తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Saripodhaa Sanivaaram

సరిపోదా శనివారం మూవీ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఓజీ (OG Movie) సినిమా కూడా ఇదే బ్యానర్ పై తెరకెక్కుతుండటంతో పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. సరిపోదా శనివారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు నాని ఫ్యాన్స్ తో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం హాజరు కావడం కొసమెరుపు.

ఏపీ ఎన్నికల సమయంలో నాని పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా కామెంట్లు చేయడంతో పవన్ ఫ్యాన్స్ సైతం నానికి సపోర్ట్ గా నిలుస్తున్నారని తెలుస్తోంది. నాని ఫ్యాన్స్ సరిపోదా శనివారం ట్రైలర్ ను రిపీట్ మోడ్ లో చూస్తున్నారు. సరిపోదా శనివారంకు పవన్ ఫ్యాన్స్ తమ వంతు సపోర్ట్ అందిస్తుండటంతో నాని ఫ్యాన్స్ సైతం ఎంతో సంతోషిస్తున్నారు. సరిపోదా శనివారం బడ్జెట్ 95 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

సరిపోదా శనివారం సినిమాకు ఏకంగా 11 కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం అందుతోంది. సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తర్వాత ఈ సినిమాకు లాభాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సరిపోదా శనివారం సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నానిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

సీనియర్ హీరోయిన్ శ్రీదేవి ఆ కోరిక తీరకుండానే మృతి చెందారా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.