March 16, 202501:41:06 PM

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల బ్యాక్ గ్రౌండ్ గురించి ఈ విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.!

శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)  .. హిందీ సినిమాలతో కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత అంటే 2018 లో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా తెరకెక్కిన ‘గూఢచారి’ (Goodachari) చిత్రంతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా తెరకెక్కిన ‘కురుప్’, మళ్ళీ అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ (Major) , మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’  (Ponniyin Selvan: I) వంటి హిట్ సినిమాల్లో నటించింది. వాస్తవానికి సినిమాలతో కంటే కూడా..

Sobhita Dhulipala

నాగ చైతన్యతో (Naga Chaitanya)   డేటింగ్ వార్తలతో ఈమె బాగా ఫేమస్ అయ్యింది అని చెప్పాలి. ఎట్టకేలకి అక్కినేని నాగ చైతన్యతో శోభిత నిశ్చితార్థం ఈరోజు నాగార్జున (Nagarjuna) ఇంట్లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా శోభిత గురించి సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే చర్చ నడుస్తుంది. ఆమె ఎవరు? అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యేంత రేంజ్ ఆమెకు ఉందా? ఇలా రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. శోభిత గురించి చెప్పాలంటే.. ఆమె తెలుగమ్మాయే..!

ఆంధ్రప్రదేశ్లోని తెనాలికి చెందిన అమ్మాయి శోభిత. ఆమె తండ్రి‌ ఓ నేవీ‌ ఆఫీసర్, తల్లి స్కూల్ టీచర్. మొదట శోభిత‌ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2013 ఫెమీనా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. అదే టైంలో ఆమెకు బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా.. విచిత్రం ఏంటంటే.. శోభిత చెల్లెలి పేరు కూడా సమంతా ధూళిపాళ్ల కావడం. కొన్నేళ్ల క్రితమే ఆమె ప్రేమ పెళ్లి చేసుకుంది. నాగ చైతన్య మొదటి భార్య పేరు కూడా సమంతనే అనే సంగతి తెలిసిందే.

బన్నీపై పవన్ కి కూడా కోపం ఉందా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.