March 16, 202508:44:31 AM

Thiragabadara Saami Collections: ‘తిరగబడరసామి’ 4 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి  (A. S. Ravi Kumar Chowdary) దర్శకత్వంలో ‘తిరగబడరసామి’ (Thiragabadara Saami) అనే కమర్షియల్ మూవీ రూపొందింది. మాల్వీ మల్హోత్రా (Malvi Malhotra) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మన్నారా చోప్రా (Mannara Chopra) కీలక పాత్ర పోషించింది. ‘సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా’ బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ (Malkapuram Shivakumar) ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆగస్టు 2న విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది.

అందువల్ల ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఇక మొదటి సోమవారం అయితే మరీ ఘోరం. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.10 cr
సీడెడ్ 0.04 cr
ఉత్తరాంధ్ర 0.07 cr
ఈస్ట్+వెస్ట్ 0.04 cr
కృష్ణా+గుంటూరు 0.07 cr
నెల్లూరు 0.03 cr
ఏపి+తెలంగాణ 0.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్(టోటల్) 0.38 cr

‘తిరగబడరసామి’ రూ.2 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 4 రోజుల్లో ఈ సినిమా కేవలం రూ.0.38 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.1.62 కోట్ల షేర్ ను రాబట్టాలి. చూస్తుంటే అది అసాధ్యంగానే కనిపిస్తుంది. ఎందుకంటే రెండో రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. తర్వాత కోలుకుంది అంటూ ఏమీ లేదు.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.