March 16, 202509:57:25 PM

Arshad Warsi: జోకర్ కాంట్రవర్సీపై స్పందించిన అర్షద్ వార్సీ.!

బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi)  మొన్నామధ్య ఓ వీడియో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో “కల్కి” (Kalki 2898 AD) సినిమాలో ప్రభాస్ (Prabhas) పాత్రను ఉద్దేశించి మాట్లాడుతూ.. “ప్రభాస్ ను జోకర్ చేసేశారు” అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఆఖరికి హీరోలు కూడా ఈ కామెంట్ పై స్పందించి రచ్చ రచ్చ చేశారు. దెబ్బకి అర్షద్ వార్సీ సోషల్ మీడియా ఎకౌంట్స్ నుండి కొన్నాళ్ళు దూరంగా ఉండిపోయాడు.

Arshad Warsi

అయితే.. అదే విషయమై నిన్న జరిగిన “ఐఫా అవార్డ్స్” రెడ్ కార్పెట్ మీద ప్రశ్నించగా.. నేను అన్నది ప్రభాస్ ను కాదు, అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను అన్నది మంచి నటుడ్ని సరిగా చూపించలేదు అని అంతే తప్ప ప్రభాస్ ను నేను ఏమీ అనలేదు అని వివరించాడు. అయితే.. జరగాల్సిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి, ఇప్పుడు అర్షద్ ఎంత క్లారిటీ ఇచ్చినా ఉపయోగం లేనట్లే.

అర్షద్ వార్సీ నిజానికి ఇచ్చిన స్టేట్మెంట్ లో తప్పు లేదు కానీ కాస్త క్లారిటీగా మాట్లాడి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు. అర్షద్ మంచి నటుడు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే.. “మున్నాభాయ్, జాలీ ఎల్.ఎల్.బి” సినిమాతో అతడు నటుడిగా తన సత్తాను ఘనంగా చాటుకొని స్థాయిని పెంచుకున్న విషయం తెలిసిందే.

అయితే.. చేసిన ఒక్క కామెంట్ కారణంగా అర్షద్ ఈ విధమైన ట్రోలింగ్ పాలవ్వాల్సిన పని కూడా లేదనుకోండి. కానీ.. ఈ సోషల్ మీడియా కాలంలో ఈ ట్రోలింగులు కామన్ అనే చెప్పాలి. ఇకపోతే.. ప్రభాస్ ప్రస్తుతం ఆస్వాదిస్తున్న స్టార్ డం కి ఈ తరహా కామెంట్స్ & ట్రోల్స్ ను పట్టించుకోవాల్సిన పని అస్సలు లేదు. ఎందుకంటే.. భారతీయ చిత్రసీమలో రెండు 1000 కోట్ల రూపాయల సినిమాలున్న ఏకైక తెలుగు హీరో ప్రభాస్!

డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తమిళ నటుడు.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.