March 16, 202501:47:32 PM

Bigg Boss 8 Telugu: ‘బిగ్ బాస్ 8’ : 4 వ రోజు వింత గొడవలు..!

మొదటి వారం నామినేషన్స్ హీట్ కొంచెం తగ్గిన తర్వాత.. హౌస్మేట్స్ కొంచెం రిలాక్స్ మోడ్లోకి వెళ్లారు అని చెప్పవచ్చు. నాలుగో రోజు ఉదయం పృథ్వీ పేస్ట్ అనుకొని ఫేస్ వాష్ బ్రెష్‌పై పెట్టుకోబోతుండగా నిఖిల్ చూసి ఆపి కాసేపు కామెడీ చేశాడు. తర్వాత నాగ మణికంఠతో విష్ణుప్రియ కాసేపు ముచ్చటించింది.ఇంకో రకంగా ఓదార్చింది అని చెప్పవచ్చు. అదే టైంలో మణికంఠ మళ్ళీ అక్కడ తన భార్య గురించి మాట్లాడుతూ టాప్ విప్పేశాడు.

Bigg Boss 8 Telugu

తర్వాత ఆదిత్య ఓం కూడా వచ్చి మణికంఠకి సర్దిచెప్పాడు. ‘జనాలు చూసుకుంటారు.. కంగారు పడకు అన్నట్టు’ ధైర్యం చెప్పి వెళ్ళాడు. ఇక మరోపక్క నైనిక- నిఖిల్ కాసేపు తమ ప్రేమ కహానీలు చెప్పుకున్నారు. అలాగే శేఖర్ బాషా , బేబక్క కూడా సరదాగా కాసేపు మాట్లాడుకుని నవ్వుకున్నారు. తర్వాత ‘బాల్ పట్టు గోల్ కొట్టు’ అంటూ ఓ గేమ్ పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో యష్మీ టీమ్ విన్ అయ్యింది. కాసేపు ఆ ఆనందంలో ఆమె టీం గంతులేసింది.

ఇదిలా ఉంటే.. హౌస్మేట్స్ టవల్స్ అన్నీ చూడటానికి కొంచెం ఒకేలా ఉంటాయి. దీంతో తన టవల్ అనుకుని ప్రేరణ టవల్ వాడేశాడు ఆదిత్య. ఈ క్రమంలో వీరి మధ్య గొడవ చోటు చేసుకుంది. ‘చూసుకోవాలి కదా’ అంటూ ప్రేరణ కాస్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గొడవని కాసేపు సాగదీసిన బిగ్‌బాస్ (Bigg Boss 8 Telugu)… ఆ తర్వాత ఆమెకు కొత్త టవల్ పంపి గొడవకి ఫుల్ స్టాప్ పెట్టాడు. అలాగే బాత్రూంలు క్లీన్ గా ఉంచడం లేదనే కారణంతో సోనియా, యష్మీ, మణికంఠ వంటి వారి మధ్య గొడవ చోటు చేసుకుంది. మరి 5 వ రోజు ఏం జరిగింది అనేది ఈరోజు (Bigg Boss 8 Telugu)  ఎపిసోడ్లో చూడొచ్చు.

ఫర్‌ ది ఫస్ట్‌ టైమ్‌.. వరద బాధితుల కోసం టాలీవుడ్‌ వండర్‌ ఫుల్‌ ఐడియా..

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.