March 16, 202509:55:58 AM

Devara Twitter Review: ‘దేవర’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది ఎలా ఉందంటే?

Devara

‘దేవర'(Devara) రిలీజ్ కోసం ఎన్టీఆర్  (Jr NTR)  అభిమానులు మాత్రమే కాదు, యావత్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక పెద్ద సినిమా వచ్చి చాలా కాలం కావస్తుంది. చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకి జనాలు థియేటర్లకు రావడం లేదు. సో చాలా మంది ప్రేక్షకులు దేవర కోసమే వెయిట్ చేశారు. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage)  తర్వాత ఎన్టీఆర్- కొరటాల శివ (Koratala Siva)  కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. పాటలు, ట్రైలర్లు అన్నీ మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి.

Devara Twitter Review

ఆల్రెడీ చాలా చోట్ల షోలు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు. వారి టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయిందట. ఆ సీన్ కి వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతమని అంటున్నారు. పాటలు చూడటానికి చాలా బాగున్నాయట. జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఎంట్రీ సీన్ కూడా ఆకట్టుకుంటుందట. అండర్ వాటర్ సీక్వెన్స్..లు, యాక్షన్ ఎపిసోడ్స్ , ఇంటర్వెల్ బ్లాక్.. ఫస్ట్ హాఫ్ కి హైలెట్ అంటున్నారు.

ఇక సెకండాఫ్ కూడా యాక్షన్ ఎపిసోడ్స్ తో నిండి ఉందట. రెండు ఫైట్లు చాలా బాగా వచ్చాయని అంటున్నారు. వాటికి రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా అదుర్స్ అంటున్నారు. వర ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి మంచి హై ఉంటుందట. సినిమాలో ఈ పాత్రని చాలా బాగా డిజైన్ చేశాడట కొరటాల. మొత్తంగా ఇది మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అని అంటున్నారు.

 

 

ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.