March 16, 202509:55:49 AM

Loukyam Collections: గోపీచంద్ ‘లౌక్యం’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే…!

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) , దర్శకుడు శ్రీవాస్ (Sriwass Oleti) కాంబినేషన్లో ‘లక్ష్యం’ (Lakshyam) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత ‘లౌక్యం’ (Loukyam) వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. కోన వెంకట్ (Kona Venkat), గోపీమోహన్ (Gopimohan)..లు రైటర్లు. 2014 సెప్టెంబర్ 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది ఈ చిత్రం. దీంతో బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్లో కలెక్ట్ చేసింది.

Loukyam Collections

మహేష్ బాబు (Mahesh Babu) ‘ఆగడు’(Aagadu) , రవితేజ (Ravi Teja) ‘పవర్’ (Power), రాంచరణ్ (Ram Charan) ‘గోవిందుడు అందరివాడేలే’ (Govindudu Andarivadele) వంటి సినిమాలు ఉన్నప్పటికీ ‘లౌక్యం’ (Loukyam) బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. నేటితో ఈ చిత్రం రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ క్రమంలో ఈ సినిమా ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం రండి :

నైజాం 7.38 cr
సీడెడ్ 2.90 cr
ఉత్తరాంధ్ర 2.70 cr
ఈస్ట్ 1.30 cr
వెస్ట్ 1.02 cr
గుంటూరు 1.85 cr
కృష్ణా 1.32 cr
నెల్లూరు 0.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +తమిళనాడు 1.92 cr
ఓవర్సీస్ 0.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 21.84 cr

‘లౌక్యం’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా ఫుల్ రన్లో బాక్సాఫీస్ వద్ద రూ.21.84 కోట్ల షేర్ ను రాబట్టింది.మొత్తంగా బయ్యర్స్ కి రూ.3.84 కోట్ల లాభాలు అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ఖాయం ‘దేవర’..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.