March 16, 202501:36:15 PM

Mega Heroes: కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకోవడంలో మెగా హీరోలే టాప్.. ఏమైందంటే?

దేశంలో ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఆదుకునే విషయంలో ముందువరసలో ఉండే హీరోలు ఎవరనే ప్రశ్నకు మెగా హీరోల (Mega Heroes) పేరు సమాధానంగా వినిపిస్తుంది. మెగా హీరోలు నెల రోజుల్లో ఏకంగా 9.4 కోట్ల రూపాయలు విరాళంగా అందించడం ద్వారా వార్తల్లో నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కోటి రూపాయల చొప్పున విరాళం ప్రకటించడంతో పాటు ఏపీలోని 400 పంచాయితీలకు లక్ష రూపాయల చొప్పున విరాళం ప్రకటించడం జరిగింది.

Mega Heroes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొత్తం 6 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. నెల రోజుల క్రితం చిరంజీవి  (Chiranjeevi) , చరణ్ (Ram Charan) కేరళ రాష్ట్రంలోని వయనాడ్ వరద బాధితుల కొరకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ, తెలంగాణ వరద బాధితుల కోసం సాయితేజ్ (Sai Tej) 25 లక్షల రూపాయలు, వరుణ్ తేజ్ (Varun Tej) 10 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటించారు. వరుణ్ తేజ్ పంచాయితీ రాజ్ శాఖకు మరో 5 లక్షలు విరాళంగా ఇచ్చి మొత్తం 15 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు.

ఈ విధంగా మెగా హీరోలు (Mega Heroes) కేవలం నెల రోజుల వ్యవధిలో ఏకంగా 9.4 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి మంచి మనస్సును చాటుకున్నారు. చిరంజీవి తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్య గురించి స్పందించి తన వంతు సహాయం చేస్తారని ప్రతిరోజు ఆయన చేసే సహాయం లక్షల్లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. మెగా హీరోల సినిమాలు సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మెగా హీరోల సినిమాలన్నీ డిసెంబర్ నుంచి వరుసగా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలు కావడంతో ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతున్నాయి. మెగా హీరోల కెరీర్ ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. పాన్ ఇండియా డైరెక్టర్లు సైతం మెగా హీరోలతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మెగా హీరోల రేంజ్ వేరే లెవెల్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

‘ది గోట్’.. మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.