
టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సందీప్ కిషన్ (Sundeep Kishan) జయాపజయాలతో సంబంధం లేకుండా హీరోగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కెరీర్ పరంగా సందీప్ కిషన్ ఎంత బిజీగా ఉన్నా సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ హీరో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల రాయన్ (Raayan) సినిమాతో సందీప్ కిషన్ మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే సోషల్ మీడియా విజ్ఞప్తికి స్పందించి సందీప్ కిషన్ 50 వేల రూపాయల సాయం చేయడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Sundeep Kishan
ఒక వ్యక్తి తన తల్లికి వైద్య చికిత్స కోసం డబ్బులు అవసరమని పేర్కొనగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తన దృష్టికి రావడంతో సందీప్ కిషన్ ఆ వ్యక్తికి 50,000 రూపాయలు గూగుల్ పే ద్వారా పంపి అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే స్పందించే సెలబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ధనుష్ (Dhanush) ట్రెండ్స్ అనే సోషల్ మీడియా గ్రూప్ ద్వారా తనకు తెలిసిన వ్యక్తి తల్లికి యాక్సిడెంట్ అయిందని మెదడులో బ్లడ్ బ్లీడింగ్ జరుగుతోందని చికిత్స కోసం ఒక రోజుకు 60,000 రూపాయలు అవసరమని ఒక వ్యక్తి పేర్కొన్నారు. సందీప్ కిషన్ తన వంతు సహాయం చేయడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రతిరోజూ కొంతమంది పేదలకు ఉచితంగా ఫుడ్ అందిస్తున్నానని సందీప్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
సందీప్ కిషన్ తెలుగుతో పాటు తమిళ సినిమాలలో సైతం నటిస్తున్నారు. ప్రస్తుతం విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్న ఈ హీరో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సందీప్ కిషన్ కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే సందీప్ ఖాతాలో మరిన్ని విజయాలు చేరే ఛాన్స్ ఉంటుంది.
Looked into this & it’s Legitimate …I have done my bit..Please trying helping in whatever you can as well
https://t.co/MnWlpmMsmY pic.twitter.com/LqIgo4CjRt
— Sundeep Kishan (@sundeepkishan) September 1, 2024