March 16, 202510:23:50 PM

The Greatest of All Time: విజయ్ సినిమాల విషయంలో జరుగుతున్న తప్పు ఇదే.. అలా చేయొద్దంటూ?

మరికొన్ని గంటల్లో వెంకట్ ప్రభు  (Venkat Prabhu) డైరెక్షన్ లో విజయ్  (Vijay Thalapathy)  హీరోగా తెరకెక్కిన ది గోట్ (The Greatest of All Time ) మూవీ రిలీజ్ కానుంది. విజయ్ గత సినిమాలైన వారసుడు (Varisu) , లియో (LEO) తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించాయి. వారసుడు సినిమాకు దిల్ రాజు (Dil Raju)  భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయగా లియో సినిమాకు సితార నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు కావడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ది గోట్ సినిమా హక్కులను సైతం మైత్రీ నిర్మాతలు సొంతం చేసుకున్నా ట్రైలర్ కు యావరేజ్ రెస్పాన్స్ రావడం,

The Greatest of All Time

ఇప్పటికే థియేటర్లలో రన్ అవుతున్న సరిపోదా శనివారం పాజిటివ్ టాక్ తో ప్రదర్శితమవుతూ ఉండటంతో ది గోట్ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. ది గోట్ సినిమాకు టాక్ కీలకం కానుందని చెప్పవచ్చు. చెన్నైలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉండేలా హైదరాబాద్ లోని కొన్ని మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి.

అయితే లియో సినిమా రేంజ్ లో ఈ సినిమాకు బుకింగ్స్ జరగడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పాజిటివ్ టాక్ వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ది గోట్ మూవీని సైతం హిట్ చేస్తారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. ది గోట్ (The Greatest of All Time) సినిమా హక్కులను మైత్రీ నిర్మాతలు ఏకంగా 22 కోట్ల రూపాయలకు తీసుకున్నారని సమాచారం అందుతోంది.

మైత్రీ నిర్మాతలకు ఈ సినిమా లాభాలను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. మైత్రీ బ్యానర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ బ్యానర్లలో ఒకటిగా కొనసాగుతుండగా ది గోట్ సినిమా ఈ బ్యానర్ రేంజ్ ను పెంచుతుందో లేదో చూడాలి. టైర్1 ప్రాంతాలలో ఈ సినిమా బుకింగ్స్ బాగానే బాగా మిగతా ఏరియాలలో ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. విజయ్ తెలుగు మార్కెట్ ను నిర్లక్ష్యం చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సెంటిమెంట్ తో ‘పీపుల్ మీడియా’ గట్టెక్కేనా..?!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.