March 16, 202501:36:13 PM

టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ‘టైటానిక్’ నటులు,మలయాళ సీనియర్ నటి కనకలత, దర్శకులు హరి కుమార్, సంగీత్ శివన్ ,బాలీవుడ్ నటి ఆశా వర్మ, మలయాళ నటుడు నిర్మల్ బెన్నీ, అలాగే మలయాళ దర్శకుడు ఎం మోహన్, ‘గులాబీ’ రైటర్ నడిమింటి నరసింగరావు వంటి వారితో పాటు ఇంకా ఎంతో మంది దర్శక నిర్మాతలు (Producer) నటులు, ఈ ఏడాది కన్నుమూశారు .

Producer

ఆ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే ఇంకో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్లోనే ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి (Producer) ఈరోజు కన్నుమూశారు. ‘వినాయక విజయం’ ‘ప్రతిబింబాలు’ వంటి చిత్రాలను ఆయన నిర్మించడం జరిగింది. శనివారం నాడు ఆంధ్రప్రదేశ్, బాపట్లకి దగ్గరగా ఉండే కారంచేడు గ్రామంలోని ఉన్న ఆయన స్వగృహమందు ఈయన  కన్నుమూసినట్టు తెలుస్తుంది. ఆయన వయస్సు 85 ఏళ్లు. వయోభారం… వంటి ఇతర సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన శనివారం నాడు మరణించినట్టు స్పష్టమవుతుంది.

ఆయన మరణానికి చింతిస్తూ టాలీవుడ్ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఇక జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి.. ‘వినాయక విజయం’ ‘ప్రతిబింబాలు’ వంటి వాటితో పాటు ‘ఒక దీపం వెలిగింది’ ‘శ్రీ వినాయక విజయం’ ‘కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త’ వంటి సినిమాలు కూడా నిర్మించారు. ఇందులో చాలా సినిమాలు ఫ్యామిలీ సబ్జెక్టులే. అలాగే ఇందులో ఒకటి, రెండు మినహాయిస్తే.. మిగిలినవి బాక్సాఫీస్ వద్ద ఆడలేదు. కానీ టీవీల్లో పసరమయ్యేప్పుడు ప్రేక్షకులు ఎక్కువగా వీక్షించారు.

ఉపాసన సాయంకు రేణుదేశాయ్ ఎమోషనల్ థాంక్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.