March 16, 202511:51:55 AM

Devara Collections: ‘దేవర’ 17 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

ఎన్టీఆర్ (Jr NTR)  , దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత తెరకెక్కిన చిత్రం ‘దేవర’ (Devara). ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ సమర్పణలో ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన పాటలు, ట్రైలర్, రిలీజ్ ట్రైలర్ సినిమాకి మంచి హైప్ తీసుకొచ్చాయి. సెప్టెంబర్ 27న ‘దేవర'(మొదటి భాగం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్ నుండి వచ్చిన సినిమా కావడంతో.. భారీ అంచనాల నడుమ కొంత మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది.

Devara Collections

అయితే టాక్ తో సంబంధం లేకుండా ‘దేవర’ మంచి ఓపెనింగ్స్ సాధించింది. వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించి బ్రేక్ ఈవెన్ సాధించింది. మొత్తంగా 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. రెండో వారం కూడా బాగానే కలెక్ట్ చేసింది. దావూది సాంగ్ యాడ్ చేయడం వల్ల 3వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంటుంది అని చెప్పాలి. ఒకసారి(Devara) 17 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 55.96 cr
సీడెడ్ 28.58 cr
ఉత్తరాంధ్ర 16.20 cr
ఈస్ట్ 9.37 cr
వెస్ట్ 7.31 cr
గుంటూరు 11.70 cr
కృష్ణా 8.32 cr
నెల్లూరు 5.52 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 142.692 cr
కర్ణాటక 15.03 cr
తమిళనాడు 2.48 cr
కేరళ 0.76 cr
నార్త్ 27.30 cr
 ఓవర్సీస్ 34.75 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 223.28 cr (షేర్)

‘దేవర’ చిత్రానికి రూ.174.4 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.175 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 6 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం 17 రోజులు పూర్తయ్యేసరికి రూ.223.28 కోట్ల షేర్ ను రాబట్టి..రికార్డులు క్రియేట్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.48.28 కోట్ల వరకు ఓవరాల్ గా ప్రాఫిట్స్ అందించింది. ‘దసరా’ సెలవుల కారణంగా ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు సాధించింది.

‘జనక అయితే గనక’ 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

 

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.