March 17, 202501:23:59 AM

Dil Raju: దిల్‌ రాజు ప్రొడక్షన్‌లోకి సెంటిమెంట్‌ దర్శకుడు.. ఆ యువ హీరో కోసమేనా?

దిల్ రాజు (Dil Raju) తన కెరీర్‌ గురించి మాట్లాడేటప్పుడల్లా తప్పక గుర్తు చేసుకునే సినిమా ‘తొలి ప్రేమ’. పంపిణీదారుడిగా కెరీర్‌ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆ సినిమాతోనే ఆయన తిరిగి కోలుకున్నారు. ఒకసారి కాదు, రీరిలీజ్‌ చేసిన ప్రతిసారి ఆ సినిమా బాగా లాభాలే తెచ్చిపెట్టింది అని కూడా చెప్పారు. అంతటి పేరు, డబ్బు తెచ్చిన పెట్టిన ఆ సినిమా దర్శకుడి కెరీర్‌ను తిరిగి ట్రాక్‌ ఎక్కంచడానికి దిల్‌ రాజు ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

Dil Raju

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ పవన్‌లో తమను తాము చూసుకున్న చిత్రాల్లో ‘తొలి ప్రేమ’ ఒకటి. ఆ సినిమాలో బాలు పాత్రను అంత బాగా తీర్చిదిద్దారు కరుణాకరన్‌. ఆ సినిమా తర్వాత ఆయన చేసిన సినిమాల్లో ‘డార్లింగ్‌’ మినహా ఏవీ ఆశించిన విజయం / ఆ స్థాయి అందుకోలేదు అని చెప్పాలి. ఇప్పుడు తిరిగి లాంటి లవ్‌ స్టోరీని సిద్ధం చేయమని కరుణాకరన్‌ను దిల్‌ రాజు అడిగారు తెలుస్తోంది. దానికి ఆయన కూడా యస్ చెప్పారు అని అంటున్నారు.

అయితే, దిల్‌ రాజు ఆ కథను ఆశిష్ రెడ్డి కోసమే అడిగారు అని సమాచారం. అంతా ఓకే అనుకుంటే త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు. ఆశిష్‌ కెరీర్‌ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఈ సమయంలో రీసెంట్‌ టైమ్స్‌లో విజయం లేని దర్శకుడితో సినిమా అంటే రిస్కే. కరుణాకర్‌ తీసిన ‘ఎందుకంటే ప్రేమంట’, ‘చిన్నదాన నీకోసం’, ‘తేజ్ ఐ లవ్ యు’ అంటూ వరుస సినిమాలు దారుణమైన ఫలితాలు ఇచ్చాయి.

దాంతో గత ఆరేళ్లుగా ఆయన సినిమాలు చేయడం లేదు. కానీ దిల్‌ రాజు మాత్రం కరుణాకరన్‌ మీద బాగా నమ్మకం పెట్టుకున్నారట. సరైన ప్రేమకథను సిద్ధం చేస్తే.. విజయం పక్కా అని అంటున్నారట. అయితే దిల్‌ రాజు స్టోరీ ఫైనలైజింగ్‌ డెసిషన్స్‌ ఇటీవల తేడా కొడుతున్నాయి కూడా. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌ విషయంలో అన్నివైపులా జాగ్రత్తలు తప్పనిసరి.

గేమ్ ఛేంజర్.. చైతూ ఎసరేట్టేలా ఉన్నాడు?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.