March 15, 202508:10:28 PM

Prabhas vs Yash: ప్రభాస్ vs యష్.. బిగ్ ఫైట్ లో మరో బిగ్ స్టార్!

2025 ఏప్రిల్ 10కు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంటోంది. రొమాంటిక్, హర్రర్ థ్రిల్లర్ తో ప్రభాస్ (Prabhas)ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమా ‘ది రాజాసాబ్’ (The Rajasaab)  రిలీజ్ డేట్ ఇదే. ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు లేవని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. అలాగే యష్(Yash) హీరోగా గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’  (Toxic) కూడా అదే తేదీన విడుదల కానున్నట్లు ప్రకటించారు. యాక్షన్, మాఫియా నేపథ్యం ఉన్న ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నా, అనుకున్న తేదీకి రిలీజ్ కోసం జట్టు ప్రయత్నిస్తోంది.

Prabhas vs Yash

ఇప్పటికే ప్రభాస్, యష్ లాంటి పెద్ద స్టార్లు ఒకే రోజున విడుదలవ్వడం పట్ల ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఇద్దరు సౌత్ ఇండియన్ హీరోలే కాదు, పాన్ ఇండియా స్థాయిలో కూడ వీరి క్రేజ్ భారీగా ఉంది. ఇది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఈ పోటీకి కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్‌లో రాబోయే మరో భారీ ప్రాజెక్ట్ కూడా జతకట్టనుంది.

37 ఏళ్ల తర్వాత మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’(Thug Life)  కూడా ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతోంది. ‘నాయకన్’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై కోలీవుడ్‌లో మంచి హైప్ నెలకొంది. కమల్, మణిరత్నం కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ బడ్జెట్ కేటాయించారు. ‘‘నాయకన్’ స్థాయిలో భారీ విజయం సాధించాలని కోలీవుడ్ ఆశిస్తోంది.

The Rajasaab

కమల్ హాసన్ కంటే ప్రభాస్‌కి పాన్ ఇండియా మార్కెట్ ఎక్కువగా ఉన్నా, ఈ పోటీ ఎలా ఉండబోతోందో చూడాలి. ఇక మూడు సినిమాలు ఒకే రోజున విడుదలైతే న్యూ రికార్డులు తిరగరాస్తాయని చెప్పవచ్చు. అయితే ముగ్గురు ఒకేసారి వచ్చినా ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది. యావరేజ్ టాక్ వస్తే లాంగ్ రన్ లో కొనసాగడం కష్టమవుతుంది.

తమిళంలో టాప్ టాలీవుడ్ కలెక్షన్స్.. పుష్ప 2 టార్గెట్ ఎంత?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.