March 16, 202510:12:46 PM

Priyanka Arul Mohan: పెళ్లి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చిన ప్రియాంక…!

ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan)..ని తెలుగు, తమిళ ప్రేక్షకులు మరో సమంత మాదిరి ఆదరిస్తున్నారు. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ తో  (Nani’s Gang Leader) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత ‘శ్రీకారం’ (Sreekaram) సినిమాలో కూడా నటించింది. అయితే అవి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించకపోవడంతో తమిళ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుసగా ‘డాక్టర్’ ‘ఈటీ’ ‘డాన్’ (Don) వంటి సినిమాల్లో నటించి స్టార్ డంని సంపాదించుకుంది. ఈ మధ్యనే ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఆ సినిమాతో మంచి ఫలితాన్నే అందుకుంది.

Priyanka Arul Mohan

ప్రస్తుతం ‘ఓజి’ (OG Movie)  సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ప్రియాంక పై.. పెళ్లి వార్తలు రావడం సంచలనంగా మారింది. ఓ స్టార్ హీరోని ప్రియాంక పెళ్ళి చేసుకున్నట్టు ప్రచారం గట్టిగానే జరిగింది. అందులోనూ ఈ మధ్యే విడాకులు తీసుకున్న హీరో ‘జయం’ రవిని ప్రియాంక పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం గట్టిగానే జరిగింది. ఎందుకంటే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇవి దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవ్వడంతో.. ప్రియాంక క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఆమె మాట్లాడుతూ.. ” ‘జయం’ రవికి జోడీగా నేను ‘బ్రదర్’ సినిమాలో నటించాను. ఆ సినిమాలో కొన్ని సీన్స్ లో భాగంగా మేము దండలు మార్చుకోవడం జరిగింది. వాటికి సంబంధించిన ఫోటోలను మేకర్స్ విడుదల చేశారు. దీంతో మాకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ నుండి అయితే కొందరు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. దీంతో ఆ ఫోటోలను విడుదల చేసినందుకు ‘బ్రదర్’ సినిమా మేకర్స్ ని నేను తిట్టుకున్నాను” అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక అరుల్ మోహన్.

ఆ విషయంలో నేను వీక్.. నాగ వంశీ కామెంట్స్ వైరల్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.