March 16, 202511:51:44 AM

Arvind Swamy, Rajinikanth: రామ్ సినిమాలో అరవింద్ స్వామి?

‘ది వారియర్’ (The Warriorr)  ‘స్కంద’ (Skanda) ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) వంటి వరుస ప్లాపులతో రామ్ (Ram) పోటీలో వెనుకపడ్డాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar)  తో వచ్చిన మాస్ ఇమేజ్ ను కాపాడుకోవాలనే తపనతో రామ్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో అతను ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో హరీష్ శంకర్ తో చేయాల్సిన సినిమాని పక్కన పెట్టి.. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)  దర్శకుడు మహేష్ బాబుతో  (Mahesh Babu P)  ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. గోదావరి బ్యాక్ డ్రాప్లో తెరకెక్కాల్సిన కథ ఇది.

Arvind Swamy, Rajinikanth

కామెడీకి ఎక్కువ స్కోప్ ఉంటుందట అలాగే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం రామ్ రూ.25 కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా కథ ప్రకారం, రామ్ తో పాటు మరో సీనియర్ స్టార్ హీరోకి ఛాన్స్ ఉందట. ఈ క్రమంలో టీం రజినీకాంత్ ను (Rajinikanth) అప్రోచ్ అయినట్టు టాక్ నడిచింది. అయితే రజనీ ఇప్పుడు ‘కూలీ’ తో (Coolie)   బిజీగా గడుపుతున్నారు.

అందువల్ల దీనికి అంగీకరించలేకపోయారని సమాచారం. తర్వాత మోహన్ లాల్ ని (Mohanlal)  కూడా అప్రోచ్ అయ్యిందట టీం. అయితే మోహన్ లాల్ కూడా ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పలేదట. ప్రస్తుతం అరవింద్ స్వామితో (Arvind Swamy)  చర్చలు జరుపుతున్నారట. అతను ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. అయితే అధికారిక ప్రకటన వస్తే తప్ప.. అది కన్ఫర్మ్ అని చెప్పలేం. ఇటీవల విడుదలైన ‘సత్యం సుందరం'(Sathyam Sundaram) తెలుగులో కూడా బాగా ఆడింది అరవింద్ స్వామి (Arvind Swamy) నటనకు మంచి మార్కులు పడ్డాయి.

 ఆ కాంట్రోవర్సీలని స్కిప్ చేసిన ‘తండేల్’ జంట!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.