March 16, 202509:56:58 PM

సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

సినీ పరిశ్రమని విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాపులర్ నటీనటులు, దర్శకుడు, టెక్నీషియన్లు, లేదు అంటే సినిమా వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వారు..ఇలా ఎవరొకరు మరణిస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. తెలుగులో అనే కాదు పక్క రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా మరణిస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇటీవల కోలీవుడ్ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్‌, నిర్మాత కోలీవుడ్ సీనియర్ నటుడు ఢిల్లీ గణేష్‌ వంటి వారు మరణించారు. ఇంకా కొంతమంది నటీనటులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచిన సందర్భాలు కూడా చూశాం.

Manoj Mitra

ఇప్పుడు మరో సీనియర్ నటుడు కన్నుమూసినట్టు తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాలీ నటుడు, రచయిత అయినటువంటి మనోజ్ మిత్రా (Manoj Mitra) ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్ళు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన కోల్ కతాలో ఉన్న ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ వస్తున్న ఆయన ఈరోజు కన్నుమూశారు. ఉదయం 8 గంటల 50 నిమిషాలకి ఆయన కన్నుమూసినట్టు తెలుస్తుంది. మనోజ్ మిత్రా సోదరుడు అమర్ మిత్రా..

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. తరుణ్ మజుందార్, బుద్ధదేబ్ దాస్ గుప్తా, బసు ఛటర్జీ, గౌతమ్ ఘోష్, శక్తి సమంత వంటి దర్శకులు తెరకెక్కించిన సినిమాల్లో మనోజ్ నటించి పాపులర్ అయ్యారు. ‘గరే బైరే’ ‘గణ శత్రు’ వంటి చిత్రాలు ఈయనకి పేరు తెచ్చిపెట్టాయి. ఇక మనోజ్ మరణవార్త అక్కడ అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అక్కడి నటీనటులు, దర్శకులు, మనోజ్ స్నేహితులు కోరుకుంటున్నారు.

ఈ టైంలో రిస్క్ అవసరమా.. వరుణ్ తేజ్…!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.