March 16, 202511:51:57 AM

Ee Nagaraniki Emaindi: విశ్వక్ సేన్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్!

‘పెళ్లి చూపులు’తో (Pelli Choopulu)  టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)  రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindhi) యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ (Vishwak Sen), అభినవ్ గోమాటం (Abhinav Gomatam), వెంకటేష్ కాకుమాను (venkatesh kakumanu), సుశాంత్ రెడ్డి (Sai Sushanth) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, కొత్త తరహా కథతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రేమించిన అభిమానులు ఉన్నారు. ఓటీటీ లో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా ఊహించని కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

Ee Nagaraniki Emaindi

వారి కోసమే ఇప్పుడు తరుణ్ భాస్కర్ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తొలి సినిమా తరహాలోనే కాస్టింగ్‌ను కొనసాగిస్తూ ‘ఈ నగరానికి ఏమైంది 2’ (Ee Nagaraniki Emaindi) స్క్రిప్ట్‌ పనుల్లో ఉండటంతో ఈ వార్త ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎస్ ఒరిజినల్స్ నిర్మాణ సంస్థ ఈ సీక్వెల్‌ను నిర్మించబోతోందని సమాచారం. ఇప్పటికే ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu) సినిమాతో ఈ సంస్థ నిర్మాణ రంగంలో అడుగుపెట్టింది.

‘ఈ నగరానికి ఏమైంది 2’ ప్రాజెక్ట్‌తో తన రెండవ సినిమా నిర్మాణానికి సిద్ధమవుతోంది. తొలి చిత్రంలోని డైలాగ్స్, సన్నివేశాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుండటంతో, సీక్వెల్‌పై హైప్ మరింతగా పెరిగింది. తాజాగా, నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ కూడా నటనతో పాటు దర్శకత్వ పనులపై దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఆయన హీరోగా ఒక సినిమాతో బిజీగా ఉండటంతో, స్క్రిప్ట్‌ వర్క్‌ను త్వరగా పూర్తి చేసి చిత్రీకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వచ్చే ఏడాది చివరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావచ్చని సమాచారం. మరోవైపు విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు. మొదటి చిత్రం సక్సెస్‌ వల్ల ఈ సీక్వెల్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ENE 2కి మంచి బడ్జెట్ కేటాయించి, ప్రేక్షకుల అంచనాలకు తగిన రీతిలో ఈ సీక్వెల్‌ని రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

 ‘తండేల్’ సంక్రాంతికి రిలీజ్ అని మేము చెప్పలేదు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.