
‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) చాలా గ్యాప్ తీసుకుని చేసిన చిత్రం ‘క'(KA). సుజీత్, సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి (C. H. Gopalakrishna Reddy) నిర్మించారు. నయన్ సారిక (Nayan Sarika) హీరోయిన్ గా నటించగా తన్వీ రామ్ (Tanvi Ram) కీలక పాత్ర పోషించింది. ‘క’ టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అక్టోబర్ 31న దీపావళి కానుకగా ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.
KA Collections:
30న ప్రీమియర్స్ కూడా వేశారు. మొదటి షోతోనే పాజిటివ్ టాక్ రాబట్టుకుంది ‘క’ చిత్రం. దీంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.95 cr |
సీడెడ్ | 0.35 cr |
ఉత్తరాంధ్ర | 0.70 cr |
ఈస్ట్ | 0.20 cr |
వెస్ట్ | 0.15 cr |
గుంటూరు | 0.20 cr |
కృష్ణా | 0.25 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 3.65 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
ఓవర్సీస్ | 0.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 4.15 cr |
‘క’ చిత్రానికి రూ.4.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.5 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.2.96 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.1.54 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజుతో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.