March 16, 202501:36:09 PM

Manchu Vishnu: పాన్ ఇండియా ఫైట్ లో కన్నప్ప రిస్క్!

మంచు విష్ణు (Manchu Vishnu)  హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప (Kannappa). బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ముకేశ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై నటీనటులు ఎంపికతోనే మంచి హైప్ క్రియేట్ చేశారు. ప్రభాస్ (Prabhas)నందీశ్వరుడు పాత్రలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) శివుడి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే మోహన్ లాల్ (Mohanlal), మోహన్ బాబు (Mohan Babu) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar) లాంటి ప్రముఖ నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పోస్టర్స్ టీజర్ ద్వారానే మినిమమ్ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

Manchu Vishnu

అయితే సినిమా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ కావాలి అంటే మిగతా భాషల్లో కూడా మంచి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో రకరకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. అసలైతే డిసెంబర్ లొనే విడుదల చేయాలని అనుకున్నప్పటికి కుదరలేదు. వివిధ కారణాల వలన విడుదల చేయలేకపోతున్నాము అంటూ మేకర్స్ వివరణ ఇచ్చారు.

అయితే ఫైనల్ గా ఇప్పుడు 2025 ఏప్రిల్ 25న విడుదల చేయనున్నట్లు అఫీషియల్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ టైమ్ లో కన్నప్ప కాస్త రిస్క్ ను ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే అదే నెలలో 10వ తేదీన ప్రభాస్ రాజా సాబ్ (The Rajasaab) వస్తుండగా 18న తేజసజ్జా (Teja Sajja) మిరాయ్ (Mirai) కూడా పాన్ ఇండియా రేంజ్ లొనే విడుదల కానుంది.

రెండు సినిమాలపై కూడా మంచి బజ్ ఉంది. ఇక ఆ తరువాత మే నెలలో విశ్వంభర  (Vishwambhara)   రానుంది. రాజాసాబ్ – మిరాయ్  హిట్ టాక్ అందుకుంటే నెల మొత్తం కూడా డామినేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి కన్నప్ప నార్మల్ టాక్ అందుకుంటే కలెక్షన్స్ అందుకోవడం కష్టమవుతుంది. ఊహించని స్థాయిలో ఆడియెన్స్ ను మెప్పిస్తేనే లాంగ్ రన్ మంచి కలెక్షన్స్ వస్తాయి. మరి కన్నప్ప ఏప్రిల్ లో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.