March 16, 202510:12:40 PM

Parvathy Thiruvothu: ధనుష్‌ – నయనతార వివాదం.. తన ఇన్వాల్వ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన పార్వతి!

ధనుష్ (Dhanush) – నయనతార (Nayanthara)  మధ్య వివాదం రేగగానే.. తొలుత స్పందించిన సినిమా సెలబ్రిటలీ నటి పార్వతి తిరువోతుడ (Parvathy Thiruvothu). ఇండస్ట్రీలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారకమందే పార్వతి రియాక్ట్‌ అయింది. ఎందుకు, ఏమిటి, ఏం జరిగింది అనే వివరాలు పూర్తిగా బయటకు రాకుండానే ‘నా సపోర్టు నయన్‌కే’ అని ఆమె తేల్చేసింది. ఆ తర్వాత కొంతమంది మాట్లాడారు. ఈ క్రమంలో పార్వతి తిరువోతు మరోసారి స్పందించింది. నయనతారకు ఎందుకు అండగా నిలిచిందనే విషయాన్ని పార్వతి ఇటీవల ఓ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Parvathy Thiruvothu

ఆమెకు మద్దతివ్వడం ఎంతో అవసరమని చెప్పిన పార్వతి.. నయనతార తరఫున నిలవడం పెద్ద పని కాదు. దానికోసం నా అదనపు సమయాన్ని కేటాయించాల్సిన అవసరం లేదని చెప్పింది. నయన్‌ పోస్ట్‌ చూసిన వెంటనే షేర్‌ చేయాలనిపించిందని, అందుకే చేశానని తెలిపింది. నయనతార గొప్ప వ్యక్తి అని, కెరీర్‌ను తనకు తానే నిర్మించుకున్న మహిళ అని పార్వతి కొనియాడింది.

అంతేకాదు ఆమె కారణం లేకుండా ఇతరులను నిందించే రకం కాదని, ఆమె ఎదుర్కొన్న అనుభవాలను ఆ లేఖలో రాసిందని భావించానని అందుకే సపోర్టు చేశానని పార్వతి చెప్పింది. ఇలాంటి పరిస్థితులు అందరి జీవితాల్లోనూ ఏదో సందర్భంలో ఎదురవుతాయని వేదాంతధోరణి కూడా కనబరిచింది. తాను ఎప్పుడూ ఇలాంటి విషయాల్లో నిజం వైపు నిలబడతానని, ముఖ్యంగా వారు స్త్రీలు అయితే సపోర్ట్ ఇవ్వడంలో ముందుంటాను అని పార్వతి తిరువోతు క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ స్పందన వెనుక వేరే కారణాలు ఉన్నాయి అని నెటిజన్ల వాదన.

ఆ విషయంలో క్లారిటీ లేదు కానీ.. పార్వతి తర్వాత శ్రుతి హాసన్‌ (Shruti Haasan) , నజ్రియా (Nazriya Nazim), ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lekshmi), అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran), ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) నయనతారకు మద్దతుగా మాట్లాడారు ఇచ్చారు. తన డాక్యుమెంటరీ ‘నయనతార: బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ కోసం ‘నాన్‌ రౌడీథాన్‌’ నుండి ఓ చిన్న వీడియో క్లిప్‌ వాడినందుకు ధనుష్‌ రూ. 10 కోట్లు అడిగాడు అని నయన్‌ ఆరోపించింది. మూడు సెకన్ల క్లిప్ కోసం లీగల్‌ నోటీసులు పంపించారనేది నయన్‌ వాదన.

గోపీచంద్ నుండి పిలుపు.. పూరీకి హీరో దొరికినట్టేనా?

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.