ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) ఈ మధ్య కాలంలో వారి నివాసంలో ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగినట్లు తెలుస్తోంది. ‘పుష్ప 2’ సక్సెస్ హిట్ టాక్ తర్వాత బన్నీ (Allu Arjun) ఫ్యామిలీకి చిరంజీవి (Chiranjeevi) ఆహ్వానం అందించారు. అయితే, ఈ లంచ్ సమావేశం కేవలం స్నేహపూర్వకమైనదే కాదు, కొన్ని కీలక చర్చలతో కూడుకున్నట్లు సమాచారం.
Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్ (Allu Arjun) మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పటికీ ఇటీవల సంధ్య థియేటర్ ఘటన కేసు వ్యవహారం తెరపైకి రావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగింది. అల్లు అర్జున్ వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై చిరంజీవి (Chiranjeevi) కీలక సలహాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా న్యాయపరమైన అంశాల్లో ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి అందుబాటులోకి రావడంలో చిరు కీలక పాత్ర పోషించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమావేశం సమయంలో ఇరువురి కుటుంబాలు కలిసి లంచ్ చేస్తూ సరదాగా గడిపారు. అల్లు అర్జున్ (Allu Arjun) సతీమణి స్నేహా రెడ్డి, చిరంజీవి (Chiranjeevi) కుటుంబ సభ్యులతో కలిసి ఫ్యామిలీ అనుబంధాన్ని మరింత బలపరిచినట్లు చెబుతున్నారు. అలాగే తాజా సినిమాల గురించి కూడా హాస్యపూర్వక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బన్నీ నటించిన ‘పుష్ప 2’కి చిరు ప్రత్యేక అభినందనలు తెలిపి, అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు మెచ్చుకున్నారు.
ఇక వ్యక్తిగత జీవితం, ప్రైవేట్ అంశాల విషయంలో బన్నీకి చిరంజీవి (Chiranjeevi) ముఖ్యమైన సలహాలు అందించినట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ హీరోల మధ్య నెలకొన్న బంధానికి ఈ భేటీ ఓ నిదర్శనమని అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఈ భేటీ తర్వాత ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా బన్నీ చిరు ఇంటికి వెళ్లి మంచి సమయాన్ని గడపడంతో ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు.. నార్త్ వాళ్ళు ఏమంటున్నారు?
కుటుంబ సమేతంగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళిన అల్లు అర్జున్
Iconstar #AlluArjun drives himself with his wife and kids to Megastar #Chiranjeevi’s house! pic.twitter.com/nnG7h6PcYH
— Filmy Focus (@FilmyFocus) December 15, 2024
– మెగాస్టార్ #Chiranjeevi ఇంటి నుంచి తన నివాసానికి బయల్దేరిన ఐకాన్ స్టార్ #AlluArjun
– సుమారు గంట పాటు మెగాస్టార్ ఇంట్లో ఉన్నా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ
– చిరంజీవి కుటుంబంతో కలిసి ఫ్యామిలీ లంచ్ చేసిన అల్లు అర్జున్ ఫ్యామిలీ. కేసు ఘటనపై మాట్లాడుకున్న చిరంజీవి, అల్లు… pic.twitter.com/aoIY8jgOGA
— Filmy Focus (@FilmyFocus) December 15, 2024