April 10, 202505:35:42 AM

Allu Arjun: అల్లు అర్జున్ అరెస్టు.. నార్త్ వాళ్ళు ఏమంటున్నారు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సంఘటన జరిగిన వారం రోజుల తర్వాతే అధికారిక చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. బన్నీ అభిమానులు ఈ అరెస్టు వెనుక కక్షపూరిత చర్య ఉందని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే, ఎందుకు అప్పుడు వెంటనే చర్యలు తీసుకోకుండా ఆలస్యంగా అరెస్టు చేయాల్సి వచ్చింది? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఘటన జరిగినప్పుడు బన్నీ థియేటర్ సందర్శనకు ముందే పోలీసులకు సమాచారం ఉందని తెలిసినా, భద్రతా లోపం ఎందుకు తలెత్తిందనేది ప్రస్తుతం డిస్కషన్ పాయింట్ అయింది.

Allu Arjun

అరెస్టు తర్వాత బన్నీ న్యాయ నిపుణులు కేసు విషయంలో చట్టపరంగా ముందుకు ఎలా వెళ్లాలో కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కానీ నార్త్ మీడియా ఈ విషయంలో ఒక కొత్త కోణాన్ని చూపిస్తోంది. బాలీవుడ్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం, ఈ అరెస్టుతో బన్నీకి మరింత పాపులారిటీ పెరిగిందని విశ్లేషిస్తున్నారు. బన్నీకి ఇప్పటికే ఉత్తరాదిలో గల మాస్ పాపులారిటీ ఈ సంఘటనతో రెట్టింపయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

ప్రత్యేకంగా ప్రెస్ మీట్‌లో తన గౌరవంగా వ్యవహరించిన తీరు, చట్టాలపై చూపిన గౌరవం ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది బన్నీని మరింత పాజిటివ్ లైట్‌లో చూపిందని అక్కడి అభిమానులు సోషల్ మీడియాలో వాదిస్తున్నారు. బన్నీ అరెస్టు జరిగేంత వరకు ఎదురుగా ఎలాంటి నెగిటివిటీ లేకుండా తన పద్ధతిలో వ్యవహరించడాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఉత్తరాదిలోని ప్రేక్షకులు, మాస్ ఆడియన్స్ “పుష్ప” (Pushpa) సినిమాతో బన్నీకి ఉన్న క్రేజ్‌ను ఇప్పుడీ సంఘటన మరింతగా పెంచుతుందని అభిప్రాయపడుతున్నారు.

“గబ్బర్ సింగ్” (Gabbar Singh) తరహాలో మాస్ హీరోలకు ఇలాంటి చర్చలు, పబ్లిసిటీ మరింత క్రేజ్‌ను తెస్తాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే, ఈ ఘటనపై బన్నీ న్యాయవాదులు త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారని సమాచారం. ఈ అరెస్టు విషయమై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఫ్యాన్స్ రియాక్షన్ ఒక ఎత్తు అయితే, ఉత్తరాది అభిమానులు బన్నీపై చూపుతున్న సపోర్ట్ మరింత హైలైట్ అవుతోంది.

టాలీవుడ్ బ్రదర్స్ తో శ్రీలీల.. క్రేజీ కాంబినేషన్స్!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.