ఓ బుల్లితెర కపుల్ ‘విడిపోయే అవకాశాలు ఉన్నాయి’ అంటూ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ‘వాళ్ళు సంతోషంగా లేని కారణంగా విడిపోతారేమో’ అని అంతా భావిస్తున్నారు. ఇంతకీ ఆ బుల్లితెర కపుల్ ఎవరు? వాళ్ళ గొడవ ఎలా బయటపడింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి. వివరాల్లోకి వెళితే.. అమర్ దీప్ చౌదరి (Amardeep Chowdary) తన భార్య తేజస్విని గౌడతో కలిసి ‘ఇస్మార్ట్ జోడి’ అనే షోకి హాజరయ్యాడు. దీనిని ఓంకార్ హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో లేటెస్ట్ ప్రోమో బయటకు వచ్చింది.
Amardeep Chowdary
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వెడ్డింగ్ థీమ్ తో లేటెస్ట్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారు. ఇందులో పాల్గొన్న జంటలు అన్నీ పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు గెటప్లలో హాజరయ్యారు. ఈ ప్రోమో మొత్తం చాలా సందడి సందడిగా సాగింది అని చెప్పాలి. ఇందులో ‘ఎఫ్ 2’ (F2 Movie) ఫేమ్ ప్రదీప్ కొండిపర్తి, రాకింగ్ రాకేష్, అలిరేజా (Ali Reza) వంటి వారు తమ లైఫ్ పార్ట్నర్స్ తో కలిసి హాజరయ్యారు. భార్యలను సరదాగా తిట్టుకుంటూ అంతా కామెడీ చేశారు. అయితే చివర్లో అమర్ దీప్ (Amardeep Chowdary) , తేజస్విని గౌడలతో ఓ చైర్ గేమ్ ఆడించాడు హోస్ట్ ఓంకార్.
ఈ క్రమంలో పెళ్లి తర్వాత సంతోషంగా ఉన్నారా? అంటూ ఓ ప్రశ్న వేశాడు. దీనికి ‘సంతోషంగా లేము’ అనుకుంటే కనుక మీరిద్దరూ ఒక చైర్ వెనక్కి వెళ్లి కూర్చోవాలి అంటూ ఆప్షన్ ఇచ్చాడు ఓంకార్. దానికి నిజంగానే అమర్ దీప్, తేజస్విని.. ఒక చైర్ వెనక్కి వెళ్లి కూర్చున్నారు. దీంతో ‘వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీళ్ళు సంతోషంగా లేరు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి’ అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది.