ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూతురు ఆద్య గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆద్య, ఆమె తల్లి రేణు దేశాయ్‌తో (Renu Desai) కలిసి వారణాసిలో ఆటోలో ప్రయాణిస్తుండడం కనిపిస్తుంది. రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో “కాశీ లో ఆద్యతో ఆటో రైడ్” అంటూ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు ఆనందంతో స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో కూతురైనా, ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడి కుటుంబంలో జన్మించినా, ఆద్య ఎంత నిరాడంబరంగా జీవిస్తుందో ఈ వీడియోలో స్పష్టమవుతోంది.
Renu Desai
పవన్ అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు కూడా ఆమె నిరాడంబరతను మెచ్చుకుంటున్నారు. “తండ్రి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, కానీ కూతురు మాత్రం సాధారణంగా జీవించడం చూసి గర్వపడుతున్నాం” అని అభిమానులు కామెంట్ల రూపంలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి స్టార్ స్టేటస్ ఉన్న కుటుంబంలో జన్మించిన పిల్లల్ని సాధారణ జీవనానికి అలవాటు చేయడం పెద్ద విషయం.
రేణు దేశాయ్ (Renu Desai) తమ పిల్లల్ని ఆడంబరాలకు దూరంగా ఉంచుతూ, సాధారణంగా పెంచడం పవన్ అభిమానుల నుంచి ప్రశంసలు పొందుతోంది. ముఖ్యంగా ఆద్య, అకిరాలను నైతిక విలువలతో పెంచడంలో రేణు దేశాయ్ పాత్ర ఎంతగానో ఉంది. రేణు దేశాయ్ తన పిల్లల కోసం ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారిని సాదాసీదా జీవనానికి అలవాటు చేస్తూ ఉండటం అనేక మంది తల్లిదండ్రులకు స్ఫూర్తిగా మారుతోంది.
ఈ వీడియో ద్వారా ఆద్య నిజ జీవితంలో ఎంత సాధారణంగా ఉండాలనే ప్రాముఖ్యతను అందరికీ సూచించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒక వైపు రాజకీయ, సినిమా రంగాలలో అత్యంత ప్రాచుర్యం ఉన్న కుటుంబం, మరోవైపు నిరాడంబర జీవనం, ఆద్య ఈ రెండు విభిన్న ప్రపంచాల మధ్య సమతుల్యత చూపించగలదని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ వీడియో ఇప్పటికీ నెట్టింట వైరల్ అవుతూ, ఆద్య వ్యక్తిత్వాన్ని వెలుగులోకి తెచ్చింది.
ఆటోలో ప్రయాణించిన @PawanKalyan కూతురు
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌లో సింప్లిసిటీగా జీవనం సాగించే వారిలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటారు. తాజాగా సింప్లిసిటీలో తండ్రికి తగ్గ తనయ అనిపిస్తోంది కూతురు ఆద్య. తాజాగా తల్లి@iam_RenuDesai కలిసి కాశీ ప్రయాణం చేసిన ఆద్య వీడియో pic.twitter.com/JnEdKB9qAo
— GH JANA (@WarWilliamson) December 28, 2024