జానీ మాస్టర్‌పై (Jani Master) వచ్చిన Laiగిక ఆరోపణల కేసు తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. ఆ ఆరోపణలతో జానీ జైలుకెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన ఆయన, ప్రస్తుతం కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టుకునే పనిలో ఉన్నారు. తన పై వచ్చిన విమర్శల గురించి పెద్దగా స్పందించకపోయినా, తన పని మీద దృష్టి పెట్టడమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు. అయితే జైలు నుంచి విడుదలైన అనంతరం స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) తనకు ఫోన్ చేసి మాట్లాడారని జానీ తెలిపారు.
Jani Master
ఆ సంభాషణ గురించి ఆయన మాట్లాడుతూ, చరణ్ తనకు ధైర్యం చెప్పడమే కాకుండా, స్ట్రాంగ్‌గా ఉండమని, హెల్త్ మీద దృష్టి పెట్టమని సూచించారని వెల్లడించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత తొలి సపోర్ట్ ఆయననుంచి రావడం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని అన్నారు. చరణ్, బుచ్చిబాబుతో (Buchi Babu Sana) కలిసి చేస్తున్న ప్రాజెక్ట్‌లో జానీ మాస్టర్‌ను కొరియోగ్రఫీ కోసం అడగడం కూడా జానీకి పెద్ద ప్రోత్సాహం ఇచ్చింది.
“వర్క్ మీద ఫోకస్ చేయమని, ఈ సినిమాకి కావాల్సిన పాటలు సిద్ధం చేయమని చరణ్ చెప్పారు. ఇది నాకు నిజంగా మోటివేషన్ అయ్యింది,” అని జానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ (Game Changer) చిత్రంలోని డోప్ సాంగ్ కోసం వర్క్ చేసిన జానీ, ఆ పాటను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమిస్తున్నారని తెలిపారు. జానీ మాస్టర్ కెరీర్‌లో రామ్ చరణ్‌తో అనేక సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
‘రచ్చ,’ (Racha) ‘నాయక్,’ (Naayak) ‘ఎవడు,’ (Yevadu) ‘రంగస్థలం’ (Rangasthalam) లాంటి సినిమాల్లో ఆయన స్టెప్పులు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు చరణ్ సపోర్ట్‌తో జానీ మాస్టర్ మరింత ఉత్తేజంతో తన పనిలో నిమగ్నమయ్యారు. ఆరోపణల నేపథ్యం ఉన్నా, టాలెంట్‌కు ప్రాధాన్యత ఇస్తూ చరణ్ ఇచ్చిన మద్దతు సినీ పరిశ్రమలో పెద్ద చర్చగా మారింది.