March 17, 202503:24:31 AM

Laapataa Ladies: మళ్లీ నిరాశే… ఆస్కార్‌లో షార్ట్ లిస్ట్‌లో నో ‘లాపతా లేడీస్‌’!

Laapataa Ladies out from Oscars race

చాలా ఏళ్లుగా జరుగుతున్నదే మళ్లీ జరిగింది. ఆస్కార్స్‌ వేదిక మీద మన సినిమాను చూసుకుందామని వెయిట్‌ చేస్తున్న భారతీయులకు మరోసారి నిరాశ ఎదురైంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) రూపంలో సినిమా పేరు ఇటీవల వినిపించినా.. అది పాట వరకు మాత్రమే. ఆ విషయం పక్కన పెడితే.. ఉత్తమ సినిమా కేటగిరీలో మన సినిమా ఉండాలి అని అనుకుంటుంటే.. ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. మన దేశం నుండి అధికారిక ఎంట్రీ అందుకున్న ‘లాపతా లేడీస్‌’  (Laapataa Ladies) షార్ట్‌ లిస్ట్‌ కాలేకపోయింది.

Laapataa Ladies

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan)  మాజీ సతీమణి కిరణ్‌రావు (Kiran Rao) దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ 2025 ఆస్కార్‌ అవార్డుల షార్ట్‌ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది ఆస్కార్స్‌లో మన దేశం ప్రస్తావన ఉండదు. ఆస్కార్‌లో షార్ట్‌ లిస్ట్‌ అవ్వడానికి ‘లాపతా లేడీస్‌’ టీమ్‌ చాలా కష్టపడింది. ‘ఆస్కార్‌’ క్యాంపెయిన్‌లో భాగంగా వరుస స్క్రీనింగ్‌లు ఇచ్చింది. హాలీవుడ్‌ మీడియాకు కిరణ్‌ రావు, ఆమిర్‌ ఖాన్‌ ఇంటర్వ్యూలు ఇచ్చారు. సినిమా విశేషాలు, గొప్పతనాన్ని చెప్పారు.

అయితే మన దేశానికి వ్యక్తికి చెందిన సినిమా మాత్రం షార్ట్‌ లిస్ట్‌ అవ్వడం గమనార్హం. భారతీయ నటి షహనా గోస్వామి (Abhay Shankar Dubey) ప్రధాన పాత్రలో నటించిన ‘సంతోష్‌’ అనే సినిమా ఆ ఘనత దక్కించుకుంది. సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ‘సంతోష్‌’ను ఇప్పుడు యూకే నుండి లిస్ట్‌లో నిలిచింది. దిల్లీలో జన్మించిన షహనా బాలీవుడ్‌ చిత్రాలతో పాటు ఇంగ్లిష్ చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇక ఇప్పటివరకు ఆస్కార్స్‌ నామినేషన్‌ ఘనతను అందుకున్న ఇండియన్‌ సినిమాలు చూస్తే.. ‘మదర్‌ ఇండియా’ (1957), ‘సలామ్‌ బాంబే’ (1988), ‘లగాన్‌’ (2001), ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ (2022) మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ‘లాపతా లేడీస్‌’ ఆ అవకాశం ఇస్తుందేమో అనుకుంటే ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో మరోసారి నెక్స్ట్‌ ఇయర్‌ చూద్దాం అని అనుకోవడమే. బ్యాడ్‌ లక్‌ ఇండియన్స్‌ ఈ సారి కూడా.

‘మీకు ఆ మమకారం లేదు’.. సుమపై ‘విరూపాక్ష’ దర్శకుడి సెటైర్లు!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.