March 16, 202511:42:46 AM

Manchu Manoj: మంచు ఫ్యామిలీ గొడవ.. మీడియా ముందుకు వచ్చిన మనోజ్..వీడియో వైరల్!

మంచు ఫ్యామిలీ గొడవలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. నిన్న మంచు మనోజ్ (Manchu Manoj)  అతని తండ్రి మోహన్ బాబు..లు ఒకరిపై ఇంకొకరు పోలీస్ కంప్లైంట్లు ఇచ్చుకోవడం జరిగింది. మనోజ్ ఫ్యామిలీపై మోహన్ బాబు (Mohan Babu), విష్ణు (Manchu Vishnu)..లు మనుషుల్ని పంపించి దాడి చేశారు అని మనోజ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక మోహన్ బాబు అయితే ‘నా చిన్న కొడుకు, అతని భార్య.. నా ఇంటికి మనుషుల్ని పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’ అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

Manchu Manoj

అయితే తాజాగా మనోజ్ మీడియా ముందుకు వచ్చి తనకి పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వడం లేదు అంటూ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. మంచు మనోజ్ మాట్లాడుతూ.. “నేను ఆస్తి కోసమో , డబ్బు కోసమో ఈ పోరాటం చేయడం లేదు. ఎంధుకంటే ఇధి పోరాటం కూడా కాదు. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నా భార్య, పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఒక మగదిగా నాతో డైరెక్ట్ గా వచ్చి ఏం చేసినా పర్వాలేదు. కానీ నన్ను తొక్కడానికి నా భార్య పేరు ప్రస్తావించడం.

నా 7 నెలల పాప పేరు ప్రస్తావించడం. నా బిడ్డలు ఇంట్లో ఉండగా.. నాతో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరకి వెళ్ళి నేను ప్రొటెక్షన్ అడిగాను. మీకు సాక్షాలు కూడా ఇస్తాను. మొన్న నేను వచ్చి అడిగినప్పుడు ఎక్కడ సార్ బౌన్సర్స్ అంటే.. చూపించాను. అప్పుడు వాళ్ళు ధక్కున్నారు. అప్పుడు ఎస్సై గారు ‘మీరు కంగారు పడకండి.

నేను ఇస్తాను ప్రొటెక్షన్’ అని చెప్పి తర్వాత పారిపోయారు. తర్వాత కానిస్టేబుల్స్ వచ్చి నా మనుషుల్ని బెదరగొట్టి పంపించేసి వేరే బాడీ గార్డ్స్ ని లోపలికి పంపించారు. డిపార్ట్మెంట్ వన్ సైడ్ తీసుకుని నా మనుషుల్ని పంపించేయదనికి వాళ్ళకి ఏ హక్కు ఉంది?” అంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఆ రెండు సీక్వెల్స్ వస్తే రూ.4000 కోట్లు సాధ్యమేనా..!

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.