‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) మొదటిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తోంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌లో ఆడియన్స్ తీరుగా థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇప్పటివరకు సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.1600 కోట్ల మార్క్ దాటినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ విజయాన్ని మరింత కొనసాగించేందుకు మేకర్స్ ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం, ‘పుష్ప 2’లో 20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట.
Pushpa 2 The Rule
ఈ కొత్త వెర్షన్ త్వరలోనే థియేటర్లలోకి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు రప్పించేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. సినిమా ప్రస్తుతం మూడు గంటల 20 నిమిషాల రన్ టైమ్ కలిగి ఉంది. ఇక 20 నిమిషాల అదనపు ఫుటేజ్ యాడ్ చేస్తే, రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలకు పెరగనుంది.
ఈ యాడెడ్ సీన్స్ ప్రధానంగా పుష్ప పాత్రకు మరింత లోతు ఇచ్చేలా, క్లైమాక్స్‌ను మరింత గ్రిప్పింగ్‌గా మార్చేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసమే ఈ సీన్స్‌ను రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. మేకర్స్ ఈ కొత్త వెర్షన్ ద్వారా రిపీట్ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఓటీటీలో విడుదలకు ముందే థియేటర్ వసూళ్లను మరింతగా పెంచేందుకు ఇది గొప్ప స్ట్రాటజీగా భావిస్తున్నారు. పైగా, కొత్త సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయనే నమ్మకంతో టీమ్ ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో, ఈ నిర్ణయంపై ట్రేడ్ అనలిస్టులు సానుకూలంగా స్పందిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల్లో, ఎలాంటి పోటీ లేకుండా ఉంది కాబట్టి, పుష 2కి కలిసొచ్చే ఛాన్స్ ఉంది.