ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule) ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాకుండా, పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1700 కోట్లకు.పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను దాటింది. హిందీ మార్కెట్‌లోనూ అత్యధిక వసూళ్లు సాధించి, బాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమాలను తలదన్నే రీతిలో దూసుకుపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
Pushpa 2 The Rule
నైజాంలో ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదవడం విశేషం. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అమితమైన స్పందన లభించింది. హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ చిత్రం అత్యధికంగా రూ.1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి ప్రత్యేక రికార్డు సృష్టించింది. ఈ థియేటర్ ముందు జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత కూడా ప్రేక్షకులు భారీ సంఖ్యలో థియేటర్‌కు తరలివచ్చారు.
ఇక శ్రీరాములు, విశ్వనాథ్, విమల్, మల్లికార్జున, ఈశ్వర్, గోకుల్ వంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.1 కోటి మార్క్ దాటిన వసూళ్లు నమోదు కావడం గమనార్హం. నైజాంలో మొత్తం రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లకు చేరుకుంటుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కలెక్షన్లలో ఎక్కువ భాగం హైదరాబాద్ నగరంలోని థియేటర్ల నుంచే రావడం ఈ చిత్రానికి ఉన్న భారీ క్రేజ్‌ను స్పష్టంగా తెలియజేస్తుంది.
సీడెడ్ లో రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ సమీపంలో ఉన్నట్లు సమాచారం. వచ్చే న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకు మరింత ఊపును తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
చిరు కొత్త సినిమా రూమర్స్‌పై నిర్మాత క్లారిటీ… అలాంటి సినిమా కాదు కానీ..!