అల్లు అర్జున్రెం (Allu Arjun) , సుకుమార్ (Sukumar) ..ల ‘పుష్ప 2’ (Pushpa2 The Rule) డో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. అల్లు అర్జున్.. సంధ్య థియేటర్ ఘటన వ్యవహారం ‘పుష్ప 2’ కి మరింత పబ్లిసిటీ చేకూర్చినట్టు తెలుస్తుంది. రెండో శనివారం, రెండో ఆదివారం.. ‘పుష్ప 2’ భారీ వసూళ్లు సాధించింది. నార్త్ వంటి ఏరియాల్లో రికార్డులని కొల్లగొట్టిన ‘పుష్ప 2’… కొన్ని చోట్ల ‘బాహుబలి 2’ (Baahubali 2) పేరిట ఉన్న రికార్డులను కూడా బ్రేక్ చేసింది.
రెండో వారం కూడా ‘పుష్ప 2’ కి తిరుగులేదు అనే చెప్పాలి. ఒకసారి ‘పుష్ప 2’ (Pushpa2 The Rule) 11 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 74.58 cr |
సీడెడ్ | 28.20 cr |
ఉత్తరాంధ్ర | 19.23 cr |
ఈస్ట్ | 10.13 cr |
వెస్ట్ | 7.98 cr |
కృష్ణా | 9.90 cr |
గుంటూరు | 11.96 cr |
నెల్లూరు | 6.10 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 168.08 cr |
కర్ణాటక | 35.90 cr |
తమిళనాడు | 10.90 cr |
కేరళ | 9.80 cr |
ఓవర్సీస్ | 94.77 cr |
నార్త్ | 237.44 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 556.89 cr (షేర్) |
‘పుష్ప 2’ (Pushpa2) చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 11 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.556.89 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా మరో రూ.48.11 కోట్ల షేర్ ను రాబట్టాలి.
‘పుష్ప 2’ ..11వ రోజుతో అక్కడ బ్రేక్ ఈవెన్ డన్..!