March 17, 202501:23:40 AM

Sai Pallavi: వెజ్ వార్తపై సాయి పల్లవి ఆగ్రహం.. చట్టపరమైన చర్యలు తప్పవు అంటూ!

సాయి పల్లవి (Sai Pallavi) నటన, ఆమె కెరీర్ ఎంచుకునే పాత్రలు ఎప్పుడూ కూడా స్పెషల్ గానే ఉంటాయి. అయితే తాజాగా ఆమెపై వస్తున్న పుకార్ల వల్ల ఈ ఫిదా బ్యూటీ తీవ్ర అసహనానికి గురైంది. బాలీవుడ్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ రామాయణలో సీత పాత్రలో సాయి పల్లవి నటించనుంది. అయితే సీత పాత్ర కోసం ఆమె పూర్తిగా శాఖాహారిగా మారిందనే ప్రచారం వైరల్ అయ్యింది. తమిళ సినీ మీడియాలో పలు హ్యాండిల్స్ ఈ వార్తలను ప్రచారం చేయడంతో, సాయి పల్లవి నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Sai Pallavi

కానీ ఈ వార్తలపై సాయి పల్లవి తేల్చి చెప్పింది. గతంలోనే ఆమె పలుమార్లు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో శాఖాహారినే అని చెప్పింది. అయితే వెబ్ మీడియా లో ఇలా అసత్య ప్రచారం అతిగా చేయడంతో ఆమె వెంటనే సీరియస్ గా స్పందించారు. నిజాలు తెలుసుకోకుండా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడాన్ని ఇకపై ఉపేక్షించను.. అంటూ సోషల్ మీడియాలో ఆమె స్పష్టత ఇచ్చింది.

తప్పుడు సమాచారం వల్ల వ్యక్తిగతంగా మనసు నొచ్చే పరిస్థితులు నెలకొంటాయి. రూమర్లు సృష్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాను.. అంటూ పల్లవి తన ఆగ్రహాన్ని బయటపెట్టింది. సాయి పల్లవి ట్వీట్ చేసిన వెంటనే నెటిజెన్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి వార్తలు సాయి పల్లవిపై ఇప్పటికే అనేకసార్లు వచ్చినా, ఈసారి మాత్రం ఆమె తీవ్రంగా స్పందించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం గమనార్హం.

ప్రస్తుతం ఆమె సీత పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. రామాయణం వంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటనకు తగిన ప్రామాణికతను ప్రదర్శించేందుకు సాయి పల్లవి కష్టపడుతోంది. మరోవైపు నాగచైతన్యతో (Naga Chaitanya)  కలిసి ‘తండేల్’ (Thandel) అనే తెలుగు సినిమాతో ఫిబ్రవరిలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

ధనుష్ గొడవ.. నేనెందుకు భయపడాలి: నయనతార

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.