దిల్ రాజు (Dil Raju) విదేశాల్లో ఉన్నారు హైదరాబాద్ రాగానే అల్లు అర్జున్ (Allu Arjun) – సంధ్య థియేటర్ ఘటన విషయం.. బెనిఫిట్ షోల విషయం తేల్చేస్తాం అని టాలీవుడ్ నిర్మతలు కొందరు, నటులు కొందరు చెప్పారు. అనుకున్నట్లుగానే ఆయన వచ్చారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డని, అటు అల్లు అర్జున్, మరోవైపు రేవతి కుటుంబాన్ని కలిశారు. అంతా తేలిపోయింది అనేలా కామెంట్స్ కూడా చేశారు. వెంటనే పరిహారం చెక్‌లు వచ్చేశాయి. ఫైనల్‌గా సీఎం రేవంత్ రెడ్డితో ఇండస్ట్రీ మీటింగ్ కూడా జరిగిపోయింది.
Tollywood
ఇదంతా ఓకే.. మీటింగ్ ఎందుకు పెట్టారు, మీటింగ్ అయ్యాక ఏం మాట్లాడారు అనేదే ఇక్కడ పాయింట్. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల కోసం.. అలాగే అల్లు అర్జున్ వ్యవహారం కోసం జరిగిన మీటింగ్ తర్వాత.. వాటి గురించి అసలు చర్చే జరగలేదు అని మీటింగ్ సమన్వయకర్త, ఎఫ్‌డీసీ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ పాయింట్ల సంగతి ఏంటి అనే చర్చ మొదలైంది.
తెలంగాణలో బెనిఫిట్ షోలు ఇక ఉండవు అని తొలుత మీటింగ్ నుండి లీకులు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఆ మాటలు తూచ్ అని ఆపేశారు. బయటికొచ్చాక దిల్ రాజును అడిగితే.. సినిమా టికెట్ రేట్లు పెంపు, బెనిఫిట్ షోలు, సంక్రాంతికి సినిమాలు ముఖ్యం కాదు అని దిల్ రాజు చెప్పారు. ఇండస్ట్రీ గ్రోత్ పైనే చర్చ జరిగిందని అని చెప్పారు. తెలుగు సినిమాను (Tollywood) ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లేందుకు పరిశ్రమ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని నిర్ణయించామని అన్నారు.
ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ అసలు విషయం ఏమైంది అనేదే ఇక్కడ ప్రశ్న. అవే అల్లు అర్జున్, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వివాదంపై చర్చించారా లేదా? చర్చిస్తే ఏం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో టికెట్ రేట్లపై చర్చించారా? చర్చిస్తే రిజల్ట్ ఏంటి? తొక్కిసలాట ఘటనపై తప్పు ఎవరిది. ప్రభుత్వం చెప్పింది కరెక్టా? లేక అల్లు అర్జున్ చెప్పింది కరెక్టా? ఇలాంటి ప్రశ్నలు ఇంకొన్ని ఉన్నాయి. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చేంతవరకు ఈ విషయంలో క్లారిటీ రాదేమో.