సంపూర్ణ నటుడు (Heroes) అంటే అన్ని రకాల వేషాలు వేయాలి. చాలా మంది స్టార్ హీరోలు ఇందుకోసం లేడీ గెటప్లలో నటించడానికి కూడా వెనుకాడలేదు.కొన్ని సినిమాల్లో లేడీ గెటప్పుల్లో కనిపించి కూడా సక్సెస్..లు అందుకున్న హీరోలు ఉన్నారు. లేట్ చేయకుండా ఆ లిస్ట్ ను ఓ లుక్కేద్దాం రండి :
Heroes
1) మహేష్ బాబు (Mahesh Babu) :
మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాల్లో ‘బాలచంద్రుడు’ ఒకటి. దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఈ చిత్రాన్ని తన ‘పద్మాలయ స్టూడియోస్’ బ్యానర్ పై నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో మహేష్ బాబు ఒక చోట లేడీ గెటప్లో కనిపిస్తారు. ఈ సినిమా టైంకి మహేష్ వయసు 15 ఏళ్లే. అయినా యాక్టింగ్ తో మెప్పించాడు. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
2) అల్లు అర్జున్ (Allu Arjun) :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ (Gangotri) లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మళ్ళీ చాలా కాలం తర్వాత ‘పుష్ప 2’ లో (Pushpa 2 The Rule) కూడా లేడీ గెటప్లో కనిపించి మెప్పించారు. రెండు సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి.
3) చిరంజీవి (Chiranjeevi) :
చిరంజీవి హీరోగా జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన ‘చంటబ్బాయ్’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 1986 లో వచ్చిన ఈ సినిమాలో చిరంజీవి ఒక పాటలో లేడీ గెటప్లో కనిపిస్తారు. సినిమా అంత ఆడలేదు కానీ.. టీవీల్లో అయితే దీన్ని బాగానే చూశారు.
4) వెంకటేష్ (Venkatesh) :
వెంకటేష్ హీరోగా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాడీగార్డ్’ (Bodyguard) సినిమాలో.. ఓ లేడీ హాస్టల్ సీన్ ఉంటుంది. అందులో వెంకటేష్ అలీతో (Ali) కలిసి లేడీ గెటప్లో కనిపిస్తారు. ఈ సినిమా కూడా బాగానే ఆడింది.
5) విశాల్ (Vishal) :
బాల (Bala) దర్శకత్వంలో విశాల్, ఆర్య (Arya) హీరోలుగా నటించిన ‘వాడు వీడు’ (Vaadu – Veedu) సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఓ సీన్లో విశాల్ లేడీ గెటప్లో కనిపిస్తాడు. సినిమా కూడా బాగానే ఆడింది.
6) మంచు మనోజ్ (Manchu Manoj,) :
మోహన్ బాబు (Mohan Babu) విష్ణు (Manchu Vishnu), మనోజ్..లు కీలక పాత్రల్లో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. శ్రీవాస్ (Sriwass Oleti) ఈ చిత్రానికి దర్శకుడు. 2014 లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది. ఈ సినిమాలో మనోజ్ లేడీ గెటప్లో కనిపించి కామెడీ పండించాడు. అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.
7) శివ కార్తికేయన్ (Sivakarthikeyan) :
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్ గా ‘రెమో’ (Remo) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2016 లో వచ్చిన ఈ సినిమాకి బక్కియరాజ్ కన్నన్ దర్శకుడు. సినిమాలో శివ కార్తికేయన్ ఎక్కువగా లేడీ గెటప్లో కనిపిస్తాడు. సినిమా బాగానే ఆడింది.
8) విజయ్ సేతుపతి :
సమంత (Samantha), రమ్యకృష్ణ (Ramya Krishnan), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సూపర్ డీలక్స్’ (Super Deluxe) సినిమాలో విజయ్ సేతుపతి లేడీ గెటప్లో కనిపిస్తాడు. సినిమా బాగా ఆడింది. విజయ్ సేతుపతి నటనకి కూడా మంచి మార్కులు పడ్డాయి.
9) విక్రమ్ (Vikram) :
సుశి గణేశన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రూపొందిన ‘మల్లన్న’ సినిమాలో విక్రమ్ చాలా రకాల గెటప్పులు వేశాడు. ఇందులో ఓ లేడీ గెటప్ కూడా ఉంటుంది.అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత ‘ఇంకొక్కడు’ అనే సినిమాలో కూడా విక్రమ్ లేడీ గెటప్లో అలరించాడు. ఇది యావరేజ్ గా ఆడింది.
10) సూర్య (Suriya) :
దివంగత కె వి ఆనంద్ దర్శకత్వంలో ‘వీడొక్కడే’ అనే సినిమా వచ్చింది. ఇందులో హీరో సూర్య స్మగ్లర్ పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతను ఎయిర్ పోర్టులో నుండి ఎస్కేప్ అవ్వడానికి చాలా గెటప్పులు వేస్తుంటాడు.అందులో లేడీ గెటప్ ఒకటి. మొదటి సాంగ్లో భాగంగా సూర్య లేడీ గెటప్లో కనిపిస్తాడు. ఈ సినిమా సో సోగా ఆడింది.
11) బాలకృష్ణ (Nandamuri Balakrishna) :
కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ‘పాండురంగడు’ (Pandurangadu) అనే సినిమా తెరకెక్కింది. ఇందులో బాలకృష్ణ లేడీ గెటప్లో కనిపిస్తారు. అలాగే ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ (NTR: Kathanayakudu) సినిమాలోని బృహన్నల అనే పాత్ర కోసం కూడా బాలకృష్ణ లేడీ గెటప్ ధరిస్తాడు. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు కానీ బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.
12) నరేష్ వి కె (Naresh) :
సీనియర్ నరేష్ హీరోగా ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా వచ్చింది. పి.ఎన్.రామచంద్రరావు దీనికి దర్శకుడు. ఈ సినిమాలో నరేష్ లేడీ గెటప్లో కనిపిస్తాడు. అతని నటనకు స్పెషల్ జ్యూరీ కేటగిరిలో నంది అవార్డు కూడా లభించింది. సినిమా కూడా బాగా ఆడింది.
13) రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) :
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘మేడమ్’ అనే సినిమా రూపొందింది. ఇందులో హీరో రాజేంద్ర ప్రసాద్ లేడీ గెటప్లో కనిపిస్తాడు. అతని నటనకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా కూడా పర్వాలేదు అనిపించేలా ఆడింది. స్పెషల్ జ్యూరీ కేటగిరిలో రాజేంద్రప్రసాద్ కి నంది అవార్డు కూడా లభించింది.
14) శ్రీవిష్ణు (Sree Vishnu) :
శ్రీవిష్ణు హీరోగా ‘శ్వాగ్’ (Swag) అనే సినిమా వచ్చింది. హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రీవిష్ణు లేడీ గెటప్లో నటించి అలరించాడు. అయితే సినిమా అంతగా ఆడలేదు.
15) సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) :
1958 లో సి.ఎస్.రావు దర్శకత్వంలో ‘అన్న తమ్ముడు’ అనే సినిమా వచ్చింది. ఇందులో ఒక చోట ఎన్టీఆర్ లేడీ గెటప్లో కనిపించి మెప్పించారు.ఈ సినిమా బాగానే ఆడింది.
16) లారెన్స్ (Raghava Lawrence) :
‘కాంచన’ (Kanchana) సినిమాలో లారెన్స్ లేడీ గెటప్లో కనిపించి అలరించాడు. ఆ సినిమా బాగా ఆడింది.
17) శరత్ కుమార్ (R. Sarathkumar) :
సీనియర్ హీరో శరత్ కుమార్ కూడా ‘కాంచన'(ముని 2) సినిమాలో లేడీ గెటప్లో కనిపించి మెప్పించారు.
18) అల్లరి నరేష్ (Allari Naresh) :
ఇ.సత్తిబాబు (E. Sathibabu) దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ (Yamudiki Mogudu) సినిమాలో అల్లరి నరేష్ ఒక చోట లేడీ గెటప్లో కనిపిస్తాడు. అలాగే ‘కితకితలు’ సినిమాలో కూడా అల్లరి నరేష్ లేడీ గెటప్లో కనిపిస్తాడు. ఈ సినిమాలు బాగానే ఆడాయి.
19) ఉదయ్ కిరణ్ (Uday Kiran) :
దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ హీరోగా ‘జోడీ నెంబర్ 1’ అనే సినిమా వచ్చింది. ఇందులో అతను లేడీ గెటప్లో కనిపిస్తాడు. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
20) రవితేజ (Ravi Teja) :
పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ (Amma Nanna O Tamila Ammayi) సినిమాలో ‘నీవే నీవే’ అనే పాటలో రవితేజ లేడీ గెటప్లో కనిపిస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
21) విశ్వక్ సేన్ (Vishwak Sen) :
‘మాస్ క దాస్’ విశ్వక్ సేన్ హీరోగా ‘లైలా’ (Laila) అనే సినిమా రాబోతుంది. రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించి అలరించనున్నాడు.