తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన తరువాత సౌత్ చిత్రాలలో బాలీవుడ్ నటుల దర్శనం ఎక్కువైంది. అందులో భాగంగా లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా పలు సౌత్ చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. ‘సైరా నరసింహారెడ్డి’లో (Sye Raa Narasimha Reddy) మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi) కలిసి నటించిన ఆయన, ‘కల్కి 2898ఏడీ’లో (Kalki 2898 AD ) కూడా ప్రభాస్‌తో (Prabhas) సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇక తాజా సమాచారం ప్రకారం, బిగ్‌బి మరో పాన్ ఇండియా తెలుగు చిత్రంలో కనిపించనున్నారని తెలుస్తోంది.
Amitabh Bachchan
అయితే ఒక్కో సినిమాకి అమితాబ్ 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక మంచి రోల్స్ వస్తే తగ్గించిన సందర్భాలు ఉన్నాయి. ఇక నెక్స్ట్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా కోసం కూడా 8 కోట్ల కంటే తక్కువే ఆఫర్ చేశారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వంలో రాబోతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం అమితాబ్‌ను కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రం 100 కోట్ల బారి బడ్జెట్ తో రాయలసీమ నేపథ్యంలోని 1800 కాలం నాటి కథతో రూపొందనుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందనను (Rashmika Mandanna) హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బిగ్‌బి కనిపిస్తే, హిందీ మార్కెట్లో ఈ చిత్రానికి బలమైన హైప్ సొంతం కావడం ఖాయం. ఈ సినిమా ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మొదటి షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్‌తోనే భారీగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో విజయ్ డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నారని, అది ప్రేక్షకులకు విశేషంగా నచ్చుతుందని సమాచారం.
అంతే కాదు, ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు వినిపిస్తోంది. ‘ది మమ్మీ’ ఫేమ్ అయిన ఆయన హాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. అయితే ఈ వార్తలలో ఎంత నిజం ఉందో మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అమితాబ్ (Amitabh Bachchan) చిత్రంలో భాగమైతే హిందీ మార్కెట్లో విజయ్ దేవరకొండ సినిమా మరింత పెద్ద ఎత్తున హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంది. రాహుల్ సాంకృత్యాన్ తన గత చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో (Shyam Singha Roy) మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి ఈ చిత్రంతో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.