రాజమౌళి తర్వాత ఫెయిల్యూర్ అంటూ లేని టాలీవుడ్ దర్శకుల లిస్టులో చేరాడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఇటీవల విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమాతో హిట్టు కొట్టి.. వరుసగా 8 హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయినప్పటికీ అనిల్ రావిపూడి డైరెక్షన్ కి వంకలు పెట్టే బ్యాచ్ ఎక్కువ. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ‘ ‘ఎఫ్ 2’ (F2 Movie) సినిమా టైం నుండి నన్ను పనిగట్టుకుని ఒక బ్యాచ్ విమర్శించడం చేస్తూనే ఉన్నాను.
Anil Ravipudi
నా సినిమాలో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని, క్రింజ్ కామెడీ ఉంటుందని’ అంటారు అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. తాజాగా జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్లో తన వేదనని వ్యక్తం చేశాడు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ… ” ‘సినిమా అనేది, స్క్రీన్ ప్లే అనేది, డైరెక్షన్ అనేది చాలా మంది స్టడీ చేసి ఉంటారు. డైరెక్షన్ అంటే ఇది, స్క్రీన్ ప్లే అంటే ఇది, రైటింగ్ అంటే ఇలా రాయాలి, క్యారెక్టర్ ఆర్క్ ఇది’ అంటూ ఏవేవో మాట్లాడుతూ ఉంటారు.
చాలా మంది స్క్రీన్ ప్లే రైటర్స్ టెక్నికల్ వర్డ్స్ తో రివ్యూలు చెబుతూ ఉంటారు. నాకు అవేవీ తెలీదు. ఏమీ తెలీవు. నాకు తెలిసిన సినిమా ఒక్కటే..’థియేటర్ కి వెళ్లి నేను సినిమా చూస్తున్నప్పుడు నాకు నచ్చిన సీన్ వస్తే విజిల్ కొడతా, చప్పట్లు కొడుతూ.., అదే నాకు తెలిసిన సినిమా, నేను అదే తీస్తా. నేను చిన్నప్పటి నుండి చూసిన సినిమా ఇదే. ఆడియన్స్ విజిల్ వేస్తే నేను కూడా విజిల్ వేస్తా, చప్పట్లు కొడితే నేను చప్పట్లు కొడుతా,క్యారెక్టర్ నన్ను ఎమోషన్ కి గురి చేస్తే ఎమోషన్ అవుతా.
ప్రతి శుక్రవారం ఏ సినిమా రిలీజ్ అయినా ఆ థియేటర్లో ఉంటా. నాకంటే సినిమా బాగా తీస్తే నేర్చుకుంటా, నేను తప్పులు చేస్తే సరిద్దుకుంటా. నా 8 సినిమాల జర్నీ ఇది. ఇక ముందు నేను తీసే సినిమాల జర్నీ కూడా ఇలానే ఉంటుంది.” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.
కంటిన్యూస్ గా 5, రూ.100 కోట్ల గ్రాస్ సినిమాలు.. 5, 1 మిలియన్ డాలర్ల సినిమాలు కొట్టాను : అనిల్ రావిపూడి#AnilRavipudi #SankranthikiVasthunam pic.twitter.com/MNj7qd9r9x
— Filmy Focus (@FilmyFocus) January 17, 2025