గతంలో ఎప్పుడూ లేని ఓ విషయాన్ని కరోనా – లాక్‌డౌన్ తర్వాత తెలుగు సినిమా అలవాటు చేసుకుంది. అదే సినిమాల (Movies) రిలీజ్ డేట్లు ముందే ప్రకటించేయడం. కొన్ని రోజులు అనుకున్నట్లుగా విడుదల చేశారు కానీ ఆ తర్వాత రిలీజ్ డేట్లు మారుతూ వచ్చాయి. వరుస పెట్టి సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించడం, మారడం నిత్యకృత్యమైంది టాలీవుడ్‌లో. దీంతో సినిమా రిలీజ్ డేట్‌లు అనౌన్స్ చేస్తుంటే ‘ఛస్ ఊరుకోండి సర్.. సినిమా ఆ టైమ్‌కి రావాలి కదా’ అని జనాలు జోక్ చేసుకునేలా మారింది.
Movies
దీనికి రీసెంట్ ఉదాహరణలు చెప్పాలంటేనే చాలా ఉన్నాయి. సంక్రాంతికి తీసుకొస్తామని చాలా నెలలుగా చెబుతూ వస్తున్న ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాను వాయిదా వేశారు. ఆఖరికి రిలీజ్ ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ కూడా లేదు. అయిందేదో అయిపోయింది అనుకుంటున్నారా? అయితే మార్చి 28 సంగతి ఇప్పుడు చూద్దాం. ఆ డేట్‌కి తెలుగు నుండి ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా వస్తుందని చాలా రోజులుగా చెబుతూనే ఉన్నారు. మొన్నీమధ్య తొలి పాట పోస్టర్‌లో కూడా ఆ డేటే వేశారు.
కానీ ఇప్పుడు ఆ డేట్‌కి ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాను తీసుకొస్తామని మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసింది. ఇక అదే డేట్‌కి వస్తామని చెప్పిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) సినిమా కూడా వచ్చేలా కనిపించడం లేదు. ‘హరి హర వీరమల్లు’ లానే ఈ సినిమాను (Movies) కూడా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు అసలు రిలీజ్ ఎప్పుడు అనేది తెలియడం లేదు.
ఇదంతా చూస్తుంటే సినిమా రిలీజ్ డేట్‌లు అని పోస్టర్లు వేయకండి సర్.. మాకు నమ్మకం లేదు దొరా అని ఫ్యాన్స్ అనే పరిస్థితి వచ్చింది. అన్నీ అనుకుని రిలీజ్‌కి దగ్గరవుతుంది అనగా సినిమా డేట్ చెబితే సరి. ఈ మూడు నాలుగు సినిమాలే కాదు.. కాస్త వెనక్కి తిరిగి చూస్తే గత కొన్నేళ్లుగా ఇదే జరుగుతోంది.