నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) బాక్సాఫీస్ వద్ద డీసెంట్ షేర్స్ ని రాబడుతుంది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. దర్శకుడు బాబీ (K. S. Ravindra) స్క్రీన్ ప్లే కొత్త ఫీలింగ్ ఇచ్చింది. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించారు. అయితే ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా వచ్చాక ‘డాకు కలెక్షన్స్’ డ్రాప్ అయ్యాయి.
Daaku Maharaaj Collections:
ఈ వారం గట్టిగా కష్టపడితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకసారి (Daaku Maharaaj) 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 13.29 cr |
సీడెడ్ | 11.50 cr |
ఉత్తరాంధ్ర | 10.14 cr |
ఈస్ట్ | 6.89 cr |
వెస్ట్ | 5.03 cr |
గుంటూరు | 7.43 cr |
కృష్ణా | 5.25 cr |
నెల్లూరు | 3.14 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 62.67 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.75 cr |
ఓవర్సీస్ | 7.86 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 74.28 cr (షేర్) |
‘డాకు మహారాజ్’ సినిమాకు రూ.83 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.83.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజుల్లో ఈ సినిమా రూ.74.28 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.9.22 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.