మెగా పవర్ స్టార్ రాంచరణ్,స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో రూపొందిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయ్యింది. ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదటి రోజు ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినప్పటికీ ఓపెనింగ్స్ ఓకే అనిపించాయి. కొత్త సినిమాలు వచ్చినా.. సంక్రాంతి సెలవుల వల్ల బాగానే క్యాష్ చేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అయితే కాదు.
Game Changer Collections:
వంద కోట్ల షేర్ మార్క్ కోసం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కష్టపడుతుంది. ఒకసారి 6 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 18.28 cr |
సీడెడ్ | 9.77 cr |
ఉత్తరాంధ్ర | 8.84 cr |
ఈస్ట్ | 5.20 cr |
వెస్ట్ | 3.61 cr |
కృష్ణా | 4.76 cr |
గుంటూరు | 5.66 cr |
నెల్లూరు | 3.32 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 59.44 cr |
కర్ణాటక | 4.70 cr |
తమిళనాడు | 3.06 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 13.58 cr |
నార్త్ | 13.02 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 94.06 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 6 రోజుల్లో ఈ సినిమాకు రూ.94.06 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.160.94 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.
Game Changer: గేమ్ ఛేంజర్.. యూఎస్ మార్కెట్లో బిగ్ షాక్!