రాంచరణ్ (Ram Charan) హీరోగా కియారా అద్వానీ (Kiara Advani) , అంజలి (Anjali) హీరోయిన్లుగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దిల్ రాజు (Dil Raju) కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది ‘గేమ్ ఛేంజర్’. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే మిక్స్డ్ టాక్ వల్ల ఓపెనింగ్స్ సో సోగానే వచ్చాయి. సంక్రాంతి సెలవులు ముగిశాక ఈ సినిమా కలెక్షన్స్ చాలా డౌన్ అయ్యాయి.
Game Changer Collections:
ఇక రెండో వీకెండ్ పైన ఆశలు పెట్టుకున్న ఈ సినిమా (Game Changer ) 8 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 18.46 cr |
సీడెడ్ | 10.04 cr |
ఉత్తరాంధ్ర | 9.67 cr |
ఈస్ట్ | 5.98 cr |
వెస్ట్ | 3.90 cr |
కృష్ణా | 5.03 cr |
గుంటూరు | 5.96 cr |
నెల్లూరు | 3.48 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 62.52 cr |
కర్ణాటక | 4.78 cr |
తమిళనాడు | 3.33 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 13.73 cr |
నార్త్ | 13.77 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 98.39 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.98.39 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.156.61 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.